దసరాకు 3 రోజులే సెలవులు
దిశ వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్1 నుంచే అకడమిక్ ఇయర్ ప్రారంభమైనట్టు బోర్డు తెలిపింది. కాగా ఈ సారి దసరా పండుగకు మూడు రోజులే సెలవులని ప్రకటించింది. అక్టోబర్23 నుంచి 25 వరకు జానియర్ కళాశాలకు సెలవులు ప్రకటించింది. జనవరి13,14లను సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. ఇక ఫిబ్రవరి22 నుంచి 27వరకు ఫ్రీ ఫైనల్, మార్చి24 నుంచి ఏప్రిల్ 12వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 24 నుంచి […]
దిశ వెబ్ డెస్క్:
రాష్ట్రంలో ఇంటర్ విద్యా సంవత్సరాన్ని ఇంటర్ బోర్డు ప్రకటించింది. సెప్టెంబర్1 నుంచే అకడమిక్ ఇయర్ ప్రారంభమైనట్టు బోర్డు తెలిపింది. కాగా ఈ సారి దసరా పండుగకు మూడు రోజులే సెలవులని ప్రకటించింది. అక్టోబర్23 నుంచి 25 వరకు జానియర్ కళాశాలకు సెలవులు ప్రకటించింది. జనవరి13,14లను సంక్రాంతి సెలవులుగా ప్రకటించింది. ఇక ఫిబ్రవరి22 నుంచి 27వరకు ఫ్రీ ఫైనల్, మార్చి24 నుంచి ఏప్రిల్ 12వరకు ఇంటర్ వార్షిక పరీక్షలను నిర్వహించనుంది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వరకు ఇంటర్ వార్షిక పరీక్షలుగా ప్రకటించింది.. ఇక ఏప్రిల్ 17 నుంచి మే 31 వరకు వేసవి సెలవులుగా ప్రకటించింది.
మే చివరి వారంలో ఇంటర్ అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1 నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ విద్యాసంవత్సరంలో పని దినాల సంఖ్యను 220 నుంచి 182కు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.