బతుకమ్మ చీరలకు అవమానం.. మండిపడుతున్న మహిళలు

దిశ ,జల్ పల్లి : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులను గౌరవిస్తూ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. బడంగ్ పేట్ ఆడపడుచులను అవమాన పరిచేవిధంగా బతుకమ్మ చీరలను చెత్త ఆటోలలో తరలించడం తీవ్ర దుమారం లేపుతుంది. చెత్త తరలించే ఆటోలలో బతుకమ్మ చీరలను బడంగ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోకి బహిరంగంగానే తరలిస్తున్నారు. చెత్త ఆటోలలో తెల్లటి సంచులలో […]

Update: 2021-10-06 03:04 GMT

దిశ ,జల్ పల్లి : తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆడపడుచులను గౌరవిస్తూ కానుకగా ఇస్తున్న బతుకమ్మ చీరలకు బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఏ మాత్రం విలువ లేకుండా పోయింది. బడంగ్ పేట్ ఆడపడుచులను అవమాన పరిచేవిధంగా బతుకమ్మ చీరలను చెత్త ఆటోలలో తరలించడం తీవ్ర దుమారం లేపుతుంది. చెత్త తరలించే ఆటోలలో బతుకమ్మ చీరలను బడంగ్ పేట్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లోకి బహిరంగంగానే తరలిస్తున్నారు.

చెత్త ఆటోలలో తెల్లటి సంచులలో బతుకమ్మ చీరలు తీసుకువచ్చిన మూటలను విప్పి పాఠశాలలో క్యూ లైన్ లో ఉన్న మహిళలకు పంపిణీ చేస్తున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. మంత్రి గా, మేయర్ గా మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతంలోనే బతుకమ్మ చీరలను తరలించడం పట్ల బీజేపీ నాయకులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. చెత్త ఆటోలలో తరలించే బతుకమ్మ చీరలు విజయదశమి పండుగ రోజు ఎలా కట్టుకుని పూజిస్తారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెత్త ఆటోలలో బతుకమ్మ చీరలను తరలించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News