ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌కు ఇంటర్న్ షిప్

దిశ, న్యూస్‌బ్యూరో: అంత‌ర్జాతీయంగా ఉద్యోగ అవ‌కాశాలు, భ‌ద్ర‌త‌ను కల్పించేందుకు ప్ర‌పంచంలో టాప్-50 యూనివ‌ర్సిటీల్లో ఒక‌టైన అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్(యూటీడీ)తో తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనివ‌ర్సిటీ ఒప్పందంతో ఆన్‌లైన్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ అందించనుంది. రాష్ట్రం ప్ర‌భుత్వం `ఇయ‌ర్ ఆఫ్ ఏఐ 2020` క్యాలెండ‌ర్‌లో భాగంగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్‌ను భాగం చేసి జూన్‌లో కృత్రిమ మేథస్సు ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. రాబోయే […]

Update: 2020-05-30 09:13 GMT

దిశ, న్యూస్‌బ్యూరో: అంత‌ర్జాతీయంగా ఉద్యోగ అవ‌కాశాలు, భ‌ద్ర‌త‌ను కల్పించేందుకు ప్ర‌పంచంలో టాప్-50 యూనివ‌ర్సిటీల్లో ఒక‌టైన అమెరికాలోని యూనివ‌ర్సిటీ ఆఫ్ టెక్సాస్ ఎట్ డల్లాస్(యూటీడీ)తో తెలంగాణ ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ యూనివ‌ర్సిటీ ఒప్పందంతో ఆన్‌లైన్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ అందించనుంది. రాష్ట్రం ప్ర‌భుత్వం 'ఇయ‌ర్ ఆఫ్ ఏఐ 2020' క్యాలెండ‌ర్‌లో భాగంగా ఇన్ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ అసోసియేష‌న్‌ను భాగం చేసి జూన్‌లో కృత్రిమ మేథస్సు ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ నిర్వ‌హిస్తామ‌ని ప్ర‌క‌టించింది. రాబోయే కాలంలో ఐటీ ప‌రిశ్ర‌మ‌ ద‌శ‌ను మార్చే, ప్ర‌జా జీవితాన్ని విశేషంగా ప్ర‌భావితం చేసే ‘ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్’ రంగాన్ని గుర్తిస్తూ రాష్ట్ర ప్ర‌భుత్వం 2020ని కృత్రిమ మేధ‌స్సు సంవ‌త్స‌రంగా నామకరణం చేసింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో మంత్రి కేటీఆర్‌, ఐటీశాఖ కార్య‌ద‌ర్శి జ‌యేశ్ రంజ‌న్ స‌మ‌క్షంలో 'ఇయ‌ర్ ఆఫ్ ఏఐ 2020' క్యాలెండ‌ర్ ఆవిష్క‌రించారు. ప్ర‌భుత్వ అంచనాల‌ను స‌ఫ‌లం చేసేందుకు టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల, టీటా ఎన్నారై స‌ల‌హాదారు ర‌వి లోతుమ‌ల్లలు యూటీడీతో సంప్ర‌దింపులు జరిపారు. టీటా భాగ‌స్వామ్యంతో ఆన్‌లైన్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ అందించేందుకు యూనివ‌ర్సిటీ ముందుకొచ్చింది. అనంత‌రం యూటీడీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జై వీర‌స్వామి టీటాతో ఈ నెల 28వ తేదీన ఒప్పందం చేసుకున్నారు. ఒప్పందం ప్ర‌కారం ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్‌ను జూన్ 8న ప్రారంభించ‌ను‌న్నారు.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, మెషిన్ లెర్నింగ్‌పై శిక్ష‌ణ ఆన్‌లైన్ విధానంలో నెలరోజులు ఉంటుంది. యూటీడీ స్టాండ‌ర్డ్స్ ప్ర‌కారం శిక్ష‌ణ పూర్త‌య్యాక అసెస్‌మెంట్ నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆన్‌లైన్ ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్ పూర్తి చేసిన వారు యూటీడీ లోగోతో కూడిన స‌ర్టిఫికెట్ పొంద‌నున్నారు. యూటీడీ డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జై వీర‌స్వామి రాష్ట్రంలోని అర్హులైన వారికి ప్ర‌తిష్టాత్మ‌క ‌శిక్ష‌ణ అందించేందుకు టీటాతో ఒప్పందం కుదుర్చుకోవ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. డిజిట‌ల్ లిట‌ర‌సీపై టీటా డిజిథాన్‌ చేస్తున్న కృషి ప్రశంసనీయమని శనివారం ఒక ప్రకటనలో చెప్పారు. ఆర్థిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ రంగంలో తెలంగాణ చేస్తున్న కృషి, క్యాలెండ‌ర్ ఇయ‌ర్ స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లులో టీటా భాగం కావ‌డం సంతోష‌క‌ర‌మ‌ని టీటా గ్లోబ‌ల్ ప్రెసిడెంట్ సందీప్ కుమార్ మ‌క్తాల తెలిపారు. రాబోయే త‌రం ఏఐ నిర్దేశితం అవుతున్నందున విద్యార్థుల‌కు ఈ శిక్ష‌ణ అందుబాటులోకి తెచ్చామ‌న్నారు. గ‌తంలో నిర్వ‌హించిన ప‌లు ఇన్‌ప్లాంట్ ట్రైనింగ్ కం ఇంట‌ర్న్‌షిప్, ఇండ‌స్ట్రీ టూర్‌ల‌లో వెయ్యి మంది వ‌ర‌కు నైపుణ్యాలు క‌ల్పించిన టీటా ఈ ఐపీటీ మ‌రియు ఇంట‌ర్న్‌షిప్ ద్వారా మ‌రింత మందిని నైపుణ్య‌వంతుల‌ను చేస్తుంద‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. పూర్తి వివ‌రాల‌కు bit.ly/tita_internship లేదా 8123123434/ 6300368705 నంబ‌ర్ల‌లో సంప్ర‌దించ‌వ‌చ్చు.

Tags:    

Similar News