‘ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్’ కు ద‌ర‌ఖాస్తుల ఆహ్వానం

దిశ‌, కొత్త‌గూడెం: రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల పరిపాలనలతో తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) నిర్వహిస్తున్న ‘‘ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్’’ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాలని భ‌ద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. గతేడాది నుంచి ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వినూత్నమైన ఆలోచనలకు రూపకల్పన చేయాలని, వాటి అమలుకు సూచించిన ప్రదర్శనలో 350 వరకు ఎంట్రీలు వచ్చాయన్నారు. అందులో 220 ప్రదర్శనలను ఎంపిక చేసి వివిధ జిల్లాల్లో 220 ఇన్నోవేటర్లను సంబంధిత కలెక్టర్ల పర్యవేక్షణలో […]

Update: 2020-07-09 06:34 GMT

దిశ‌, కొత్త‌గూడెం: రాష్ట్రంలోని మొత్తం 33 జిల్లాల పరిపాలనలతో తెలంగాణ ప్రభుత్వం ఇన్నోవేషన్ సెల్ (టీఎస్ఐసీ) నిర్వహిస్తున్న ‘‘ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్’’ కు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు చేయాలని భ‌ద్రాద్రి జిల్లా కలెక్టర్ ఎంవీ రెడ్డి తెలిపారు. గతేడాది నుంచి ప్రభుత్వం ప్రజల్లో ఉన్న వినూత్నమైన ఆలోచనలకు రూపకల్పన చేయాలని, వాటి అమలుకు సూచించిన ప్రదర్శనలో 350 వరకు ఎంట్రీలు వచ్చాయన్నారు. అందులో 220 ప్రదర్శనలను ఎంపిక చేసి వివిధ జిల్లాల్లో 220 ఇన్నోవేటర్లను సంబంధిత కలెక్టర్ల పర్యవేక్షణలో ఆవిష్కకర్తలు ప్రదర్శించినట్టు చెప్పారు. ఈ ఏడాది కూడా ప్రభుత్వం ఈ వినూత్న ఆవిష్కరణలు కార్యక్రమాన్ని చేయాలని నిర్ణయించినందున కరోనా మహమ్మారి వ్యాధి నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్‌కు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. మన జిల్లా నుంచి ఆన్లైన్ ద్వారా ఎంపిక చేసిన ఇన్నోవేటర్లు ఆన్‌లైన్ ఫోరమ్ ద్వారా రానున్న ఆగస్టు 15 వేడుకల్లో సోషల్ మీడియా ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయనున్నట్టు ఆయన చెప్పారు. వివరాలకు ప్రోగ్రాం మేనేజర్ 7032478688 లేదా రాష్ట్రస్థాయి సీనియర్ ఇన్నోవేటర్ ప్రణయ్ కుమార్ 7799042489 లను ఫోన్ ద్వారా సంప్రదించి వివరాలను తెలుసుకోవచ్చని ఆయన సూచించారు.

Tags:    

Similar News