మామూలగైతే వందల్లో.. ప్రస్తుతం వేలల్లో
దిశ, రంగారెడ్డి: ఆ గ్రామవాసులంతా కాయకష్టం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వారి ఇండ్లలో ఓ టీవీ, ఫ్యాన్, రెండు లైట్లు ఉంటాయ్ అంతే. కరెంట్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా రూ.200 నుంచి రూ. 400 వరకు వచ్చేది. కానీ ఈ నెల మాత్రం వందల్లో వచ్చే బిల్లు ఒక్కసారిగా వేల రూపాయాల్లో రావడంతో గ్రామస్తులంతా కంగుతిన్నారు. ఈ ఘటన కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కో ఇంటికి […]
దిశ, రంగారెడ్డి: ఆ గ్రామవాసులంతా కాయకష్టం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు. వారి ఇండ్లలో ఓ టీవీ, ఫ్యాన్, రెండు లైట్లు ఉంటాయ్ అంతే. కరెంట్ వినియోగం కూడా చాలా తక్కువగా ఉంటుంది. కరెంట్ బిల్లు కూడా రూ.200 నుంచి రూ. 400 వరకు వచ్చేది. కానీ ఈ నెల మాత్రం వందల్లో వచ్చే బిల్లు ఒక్కసారిగా వేల రూపాయాల్లో రావడంతో గ్రామస్తులంతా కంగుతిన్నారు. ఈ ఘటన కొత్తూరు మండలం ఇన్ముల్ నర్వ గ్రామంలో చోటుచేసుకుంది. ఒక్కో ఇంటికి రూ.11 వేల నుంచి 20 వేల కరెంట్ బిల్లు రావడంతో శుక్రవారం విద్యుత్ సిబ్బందిని గ్రామస్తులు అడ్డుకున్నారు. కాయ కష్టం చేసుకొని బతికే తాము ఈ బిల్లులు ఎలా కట్టాలని నిలదీశారు.