అధికారుల నిర్లక్ష్యం.. వీధి కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
దిశ, కాళోజీ జంక్షన్ : గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివ నగర్‌లోని పలు వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. వీధి కుక్కల మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గ్రేటర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే బుధవారం ఉదయం ఆరు బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. […]
దిశ, కాళోజీ జంక్షన్ : గ్రేటర్ వరంగల్ 34 డివిజన్ శివ నగర్‌లోని పలు వీధుల్లో కుక్కలు గుంపులు గుంపులుగా స్వైరవిహారం చేస్తూ ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. రాత్రి వేళల్లో కుక్కల అరుపులతో ఇంటి నుంచి బయటికి రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు.
వీధి కుక్కల మూలంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని కాలనీ వాసులు గ్రేటర్ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. అయితే బుధవారం ఉదయం ఆరు బయట ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి గాయపరిచాయి. అటుగా వెళుతున్నవారు చూసి చిన్నారిని రక్షించారు. చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆ బాలుడిని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకు వెళ్లారు.
ఇప్పటికైనా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ అధికారులు, స్థానిక కార్పొరేటర్ ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.