మహేశ్వరం మార్కెట్‎లో మౌలిక సదుపాయాలు: సబితా

దిశ, రంగారెడ్డి: మహేశ్వరం మార్కెట్‎లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని మంత్రి కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9.28 ఎకరాలలో మార్కెట్ కార్యాలయం, రెండు షెడ్లు, గోదాంలు, రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే స్టాళ్లు, తాగునీరు, మరుగుదొడ్డు నిర్మించాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పాలని చెప్పారు. సుమారు రూ. […]

Update: 2020-05-28 10:16 GMT

దిశ, రంగారెడ్డి: మహేశ్వరం మార్కెట్‎లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నగరంలోని మంత్రి కార్యాలయంలో మార్కెటింగ్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 9.28 ఎకరాలలో మార్కెట్ కార్యాలయం, రెండు షెడ్లు, గోదాంలు, రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముకునే స్టాళ్లు, తాగునీరు, మరుగుదొడ్డు నిర్మించాలని సూచించారు. అలాగే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను కూడా నెలకొల్పాలని చెప్పారు. సుమారు రూ. 2 కోట్ల నిధులతో పనులు ప్రారంభించాలన్నారు. వీటికి సంబంధించిన సమగ్ర ప్రణాళికను సిద్ధం చేయాలని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మార్కెటింగ్ అధికారులను ఆదేశించారు.

Tags:    

Similar News