వీళ్లకు ఇదే చివరి IPL అవుతుందా ?
దిశ వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన ఐపీఎల్- 2021 రెండోదశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సంగతి అలా ఉంచితే ఈ సీజన్ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఈవెంట్‌కు వీడ్కోలు చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేకపోవడం సమస్యగా మారింది. వయో భారంతో అవకాశాలు తగ్గడంతో వీరు ఈ నిర్ణయం తీసుకోనున్నారని క్రికెట్ […]
దిశ వెబ్‌డెస్క్: ప్రపంచ క్రికెట్ అభిమానులు వెయ్యి కళ్లతో ఎదురుచూసిన ఐపీఎల్- 2021 రెండోదశ మ్యాచ్‌లు ప్రారంభమయ్యాయి. డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల మధ్య తొలి మ్యాచ్ ప్రారంభమైంది. ఈ సంగతి అలా ఉంచితే ఈ సీజన్ తర్వాత కొంత మంది భారత ఆటగాళ్లు ఐపీఎల్ ఈవెంట్‌కు వీడ్కోలు చెప్పనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఫామ్‌లో లేకపోవడం సమస్యగా మారింది. వయో భారంతో అవకాశాలు తగ్గడంతో వీరు ఈ నిర్ణయం తీసుకోనున్నారని క్రికెట్ అభిమానులు గుసగులాడుకుంటున్నారు. దాంతో పాటు టీం యాజమాన్యాలు యువకులకు ఎక్కువ అవకాశాలు ఇస్తుండటంతో వీరు ఆడటం కష్టంగా మారింది.
రాబిన్ ఉతప్ప..
టీమిండియాలో సుధీర్ఘ కాలం పాటు వికెట్ కీపర్, బ్యాట్సెమెన్ గా రాబిన్ ఉతప్ప సేవలందించాడు. బ్యాట్ పట్టుకొని ముందుకు వచ్చి సిక్స్‌లు కొట్టడంలో మంచి దమ్మున్న బ్యాట్సెమెన్గా పేరుగాంచాడు. ఐపీఎల్ కెరీర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్‌తో ప్రారంభించి ఐదు సీజన్ల పాటు కోల్‌కతా నైట్ రైడర్స్ తరుపున అద్భతంగా రాణించాడు. 2014లో అత్యధిక పరుగులు చేసి ఆరెంజ్ క్యాప్‌ను సొంతం చేసుకున్నాడు. కొన్నాళ్లు రాజస్థాన్ రాయల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం ఉతప్ప చెన్నై సూపర్ కింగ్స్‌తో కొనసాగుతున్నాడు. ప్రస్తుతం చెన్నై తరుపున ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడే అవకాశం దొరకలేదు. దీంతో పాటు ఫామ్‌లో లేనందున ఐపీఎల్‌కు వీడ్కోలు పలకవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
అమిత్ మిశ్రా..
ఐపీఎల్‌లో మిశ్రా తన పేరు మీద అనేక రికార్డులు లిఖించుకున్నాడు. అత్యధిక వికెట్లు సాధించిన రెండో బౌలర్‌గా.. అత్యధిక హ్యాట్రిక్‌లు(3) సాధించిన బౌలర్‌గా అద్భుతమైన రికార్డు ఉంది. తన ఐపీఎల్ కెరీర్‌ను ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించి, సన్ రైజర్స్ హైదరాబాద్, పుణే వారియర్స్‌కు కొన్నాళ్లు ఆ జట్లకు సేవలందించాడు. ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్‌లో కొనసాగుతున్నాడు. కొన్ని నెలల్లో 39 ఏళ్లు పూర్తి చేసుకోబొతున్నాడు. దీంతో ఇదే అఖరి సీజన్ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ కెరీర్‌లో 154 మ్యాచ్‌లు ఆడి 166 వికెట్లు సాధించాడు.
హర్భజన్ సింగ్..
హర్భజన్ సింగ్‌ను ముద్దుగా భజ్జీ అని పిలిచే పంజాబ్ కింగ్టీమిండియాకు సేవలందించిన అత్యత్తుమ స్పిన్నర్లలో ఒకరిగా పేరు గాంచారు. భారత్ తరపున టెస్టు క్రికెట్లో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా అరుదైన ఘనత సాధించాడు. తన ఐపీఎల్ కెరీర్‌ను ముంబై ఇండియన్స్‌తో ప్రారంభించి తొమ్మిది సీజన్ల పాటు ఆ జట్టుకు సేవలందించాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరపున రెండు సీజన్ల ఆడాడు. ఈ సీజన్‌లో ఈ వెటరన్ ఆఫ్ స్పిన్నర్‌ని కోల్‌కతా నైట్‌రైడర్స్ కొనుగోలు చేసింది. కానీ ఐపీఎల్ మెదటి దశలో తుది జట్టులో ఆడే అవకాశం దక్కలేదు. ఈ ఏడాది జూలైలో 40వ పడిలోకి అడుగు పెట్టిన భజ్జీ ఈ ఐపీఎల్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు 160 మ్యాచ్‌లు ఆడి 150 వికెట్లు పడగొట్టాడు.
వృద్ధిమాన్ సాహా..
భారత టెస్టు వికెట్ కీపర్‌గా సేవలందించిన సాహా ఐపీఎల్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ తో ప్రారంభించాడు. మూడు సీజన్ల పాటు చెన్నై సూపర్ కింగ్స్, పంజాబ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో కొనసాగుతున్నాడు. సన్‌రైజర్స్ జట్టులోని ఇంగ్లండ్ స్టార్ ఓపెనర్ జానీ బెయిర్ స్టో దూరమయ్యాడు. దీంతో సాహాకు ఓపెనింగ్ చేసే అవకాశాలున్నాయి. 37 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్నందున ఐపీఎల్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని సమాచారం. ఐపీఎల్ కెరీర్‌లో 126 మ్యాచ్‌లు ఆడి 1987 పరుగులు సాధించాడు.
కేదార్ జాదవ్ ..
కేదార్ జాదవ్ టీమిండియాలో, ఐపీఎల్‌లో ఆద్భుతమైన ఆటగాడు కానప్పటికీ అతనికి చాలా అవకాశాలు కల్పించారు. కానీ వాటిని మలుచుకోలేకపోయాడనే అపవాదు ఉంది. తన ఐపీఎల్ కెరీర్‌లో కొన్ని మ్యాచ్‌ల్లో మాత్రమే మంచి ఇన్నింగ్స్ ఆడాడు. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో ప్రారంభించాడు. 2018లో ని చెన్నై సూపర్ కింగ్స్ భారీ ధరకు కొనుగోలు చేసింది. ప్రస్తుతం సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. 36 ఏళ్ల జాదవ్ ఫామ్‌లో లేనందున, ఇది చివరి సీజన్ కావొచ్చు. వినికిడి. 91మ్యాచ్‌ల్లో 1181 పరుగులు సాధించాడు.