కరోనాతో పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతి..
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా.. వైరస్ వ్యాప్తి మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా బారిన పడి ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతిచెందారు. ఇటీవల ఈయన కరోనా బారిన పడగా, యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి […]
దిశ, వెబ్‌డెస్క్: రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఏపీతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కేసులు తక్కువగానే నమోదవుతున్నా.. వైరస్ వ్యాప్తి మాత్రం తీవ్రంగానే ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా కరోనా బారిన పడి ఏపీకి చెందిన ప్రముఖ పారిశ్రామిక వేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి మృతిచెందారు. ఇటీవల ఈయన కరోనా బారిన పడగా, యశోద ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. కాగా, బుధవారం మధ్యాహ్నం పరిస్థితి విషమించి ఆయన కన్నుమూశారు.
హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి చెన్నకేశవరెడ్డి కుమారుడే ఈ పారిశ్రామికవేత్త పాలం శ్రీకాంత్ రెడ్డి కావడం విశేషం. కాగా, ఆయన గతంలో కడప ఎంపీగా పోటీ చేసి జగన్ చేతిలో ఓడిపోయారు. అంతేకాకుండా రాయలసీమ అభివృద్ధికి రాజకీయాలకతీతంగా పాటుపడ్డారు.