కరెంట్ చార్జీల పెంపుపై వైసీపీ పోరుబాట

ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. కరెంట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది.

Update: 2024-12-22 09:08 GMT

దిశ, వెబ్ డెస్క్: ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. రాష్ట్రాంలో అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని.. కరెంట్ ఛార్జీలను పెంచాలని నిర్ణయించింది. కాగా ఈ కరెంట్ చార్జీల పెంపను నిరసిస్తూ.. ఈ నెల 27న పోరుబాట నిర్వహించాలని వైసీపీ(YCP) పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన పోస్టర్ ను వైసీపీ నేతలు(YCP leaders) ఆదివారం మధ్యాహ్నం ప్రారంభించారు. ప్రజల నడ్డి విరిచేందుకే కరెంట్ చార్జీలు పెంచారని, కరెంట్ చార్జీలను తగ్గించే వరకు పోరాటం చేస్తామని మాజీ మంత్రి జోగి రమేష్‌(మాజీ మంత్రి జోగి రమేష్‌) అన్నారు. అలాగే.. రాష్ట్రంలో చంద్రబాబు బాదుడు బాబుగా మారారని మేరుగు నాగార్జున(Merugu Nagarjuna) విమర్శించగా.. ఈ నెల 27న రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు నిరసన ర్యాలీలు నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. అలాగే సీఎం చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ..ప్రజలతో కలిసి పోరాటాలు చేస్తామని వైసీపీ నేత వెలంపల్లి చెప్పుకొచ్చారు.


Similar News