Nara Bhuvaneshwari: ఊపిరి ఉన్నంత వరకు ఆ పని చేస్తా.. నారా భువనేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు
రాష్ట్రంలో రాక్షస పాలన పోయి.. రామ రాజ్యం వచ్చిందని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు.
దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో రాక్షస పాలన పోయి.. రామ రాజ్యం వచ్చిందని నారా భువనేశ్వరి (Nara Bhuvaneshwari) అన్నారు. ఇవాళ ఆమె చిత్తూరు (Chittor) జిల్లాలోని శాంతిపురం (Shanthipuram) మండలం చేల్దగానిపల్లి (Cheldaganipalli)లో మహిళలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఊపిరి ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానని పేర్కొన్నారు. ఐదేళ్లు అధికారంలో వైసీపీ ప్రభుత్వం (YCP Government) రాష్ట్రంలోని అన్ని రంగాలను నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు.
మరోవైపు అన్యాయంగా టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి చిత్రహింసలు పెట్టారని గుర్తు చేశారు. అయినా, ఏ మాత్రం తగ్గకుండా జగన్ (Jagan) అవినీతి పాలనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) రాజీలేని పోరాటం చేశారని పేర్కొన్నారు. కుప్పం నియోజకవర్గ (Kuppam Constituency) ప్రజలు తమకు కుటుంబ సభ్యులతో సమానమని.. వారి రుణం ఈ జన్మలో తీర్చుకోలేదని అన్నారు. ఆ నాడు అక్రమ కేసుల్లో చంద్రబాబు అరెస్ట్ అయి రాజమండ్రి జైల్లో ఉంటే ప్రజలు, కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి వైసీపీ ప్రభుత్వాని(YCP Government)కి వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు. జగన్ (Jagan) అరాచకాలను గమనించిన ప్రజలు మళ్లీ చంద్రబాబు సుపరిపాలనకే జై కొట్టారని నారా భువనేశ్వరి అన్నారు.