ఇంద్రవెల్లి సభ ఫుల్ సక్సెస్ : కాంగ్రెస్ నేతల ఆనందం
దిశ, ముధోల్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభకు వచ్చిన ప్రజలను చూస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ప్రారంభమైందని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటుచేసిన ఈ సభకు అనుకున్న దానికి మించి ప్రజలు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు.. […]
దిశ, ముధోల్ : ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో సోమవారం జరిగిన దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా మహాసభకు వచ్చిన ప్రజలను చూస్తే కేసీఆర్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత ప్రారంభమైందని నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షుడు పవర్ రామారావు పటేల్ అన్నారు. మంగళవారం బైంసా పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీపీసీసీ రేవంత్ రెడ్డి సారథ్యంలో ఏర్పాటుచేసిన ఈ సభకు అనుకున్న దానికి మించి ప్రజలు వచ్చారని ఆనందం వ్యక్తం చేశారు. ప్రజలు.. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలను గుర్తిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా సభను విజయవంతం చేసినందుకు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, నిర్మల్ జిల్లా, ముధోల్ నియోజకవర్గం కాంగ్రెస్ కార్యకర్తలకు, ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎన్నికైన నాటి నుంచి కాంగ్రెస్‌లో నూతన ఉత్సాహం పెరిగిందని తెలిపారు. ఇదే ఉత్సాహన్ని ప్రదర్శించి రానున్న రోజులలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమని అన్నారు. నిష్పక్షపాతంగా ప్రజల పక్షాన నిలిచే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.