‘కేసీఆర్ మోసానికి తెర లేపాడు.. అందుకే దళితులపై ప్రేమ’

దిశ,గోదావరిఖని : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని రామగుండం కో కన్వీనర్ దోమ్మెటి సాంబయ్య అన్నారు. ఆదివారం గోదావరిఖని దుర్గనగర్‌లోని లక్ష్మిప్రసన్న గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొమ్మెటి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికే దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభ అని అన్నారు. ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన […]

Update: 2021-08-08 03:19 GMT

దిశ,గోదావరిఖని : టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో రేపు జరిగే ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయాలని రామగుండం కో కన్వీనర్ దోమ్మెటి సాంబయ్య అన్నారు. ఆదివారం గోదావరిఖని దుర్గనగర్‌లోని లక్ష్మిప్రసన్న గార్డెన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో దొమ్మెటి సాంబయ్య, కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎం.ఎస్ రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ… ఈ ప్రభుత్వానికి బుద్ది చెప్పడానికే దళిత, గిరిజన ఆత్మ గౌరవ సభ అని అన్నారు. ఇంద్రవెల్లి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గిరిజన ఉద్యమం ప్రారంభమవుతుందని, కేసీఆర్ మాయమాటలు చెప్పి దళిత, గిరిజనుల ఓట్లు దండుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు దళిత బంధు పేరుతో కెసీఆర్ మరో మోసానికి తెరలేపాడని పేర్కొన్నారు.

హుజూరాబాద్ ఎన్నికలు ఉన్నాయి కాబట్టే .. కేసీఆర్‌కు దళితులు గుర్తుకు వచ్చారని అన్నారు. గత ఏడు సంవత్సరాల్లో ఏనాడు లేని విధంగా ఆకస్మాత్తుగా ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఎస్సీల మీద ప్రేమ పుట్టు కొచ్చిందని, అందులో భాగంగా గత జూన్ 27న కెసీఆర్ అధికార నివాసమైన ప్రగతి భవన్‌లో దళిత సాధికారతపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో హుజురాబాద్ నుంచి మొదలు రాష్ట్రంలో ఉన్న దళిత కుటుంబాల అందరికీ 10 లక్షలు వారి వారి బ్యాంకు ఖాతాల్లో వేస్తామని మోస పూరిత హామీలు ఇస్తున్నాడనీ అన్నారు. కెసీఆర్ ప్రభుత్వానికి దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే రాష్ట్రమంతటా ప్రవేశ పెట్టాలని వెంటనే ప్రభుత్వం దళిత బంధు మీద రాష్ట్ర ప్రభుత్వం అధికారిక జీవోను విడుదల చేయాలని, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతి ఒక్కరు ఇంద్రవెల్లికి తరలివచ్చి సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో బొంతల రాజేష్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, ఎం. రవికుమార్, కొలిపాక సుజాత ఎండీ ముస్తాఫా, పెద్దెల్లి ప్రకాశ్, గాదం విజయ, ఫకురొద్దిన్, నగునూరి రాజు, ముదాం శ్రీనివాస్, గట్ల రమేశ్, నాజిమొద్దిన్, యుగెందర్, నాయిని ఒదేలు, కొప్పుల శంకర్, దాసరి ఆనంద్, డబ్బేట రమేష్, డా. రియాజ్, నాజిమ్, యకుబ్, ఆసిఫ్ పాషా, కౌటం సతీష్, సాయి కిరణ్, పీక అరుణ్ కుమార్, ప్రవీణ్, అష్రాఫ్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News