ఫిబ్రవరి నాటికి దేశీయంగా సాధారణ కార్యకలాపాలు : ఇండిగో!
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల వరుస త్రైమాసికాల్లో నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2021 చివరి నాటికి సాధారణ స్థాయికి తిరిగి రావాలని భావిస్తున్నట్టు బడ్జెట్ క్యారియర్ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రొనోజోయ్ దత్తా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దేశీయ కార్యకలాపాలు కొవిడ్-19కి ముందు స్థాయికి చేరుకునే అవకాశముందని, అయితే, యూకేలో కొత్తగా వ్యాప్తి చెందుతున్న కరోనాతో మళ్లీ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ సేవల్లో కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బుధవారం […]
దిశ, వెబ్‌డెస్క్ : ఇటీవల వరుస త్రైమాసికాల్లో నష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2021 చివరి నాటికి సాధారణ స్థాయికి తిరిగి రావాలని భావిస్తున్నట్టు బడ్జెట్ క్యారియర్ విమానయాన సంస్థ ఇండిగో సీఈవో రొనోజోయ్ దత్తా తెలిపారు. వచ్చే ఏడాది జనవరి లేదా ఫిబ్రవరి నాటికి దేశీయ కార్యకలాపాలు కొవిడ్-19కి ముందు స్థాయికి చేరుకునే అవకాశముందని, అయితే, యూకేలో కొత్తగా వ్యాప్తి చెందుతున్న కరోనాతో మళ్లీ ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ సేవల్లో కోలుకునేందుకు మరింత సమయం పడుతుందని బుధవారం ఆయన స్పష్టం చేశారు.
కార్యకలాపాల మెరుగుదలతో ఇండిగో సంస్థ రానున్న మూడు నెలల్లో నెమ్మదిగా ఉద్యోగులను తిరిగి నియమించుకోగలదని రొనోజోయ్ దత్తా అభిప్రాయపడ్డారు. అనేక సవాళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నామని, ముఖ్యంగా దేశీయంగా కోలుకుంటున్నామని తెలిపారు. ఈ ఏడాది కరోనా సంబంధిత పరిణామాలతో ఇండిగో తమ ఉద్యోగుల్లో 10 శాతం అంటే 2,300 మంది ఉద్యోగులను తొలగించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా సంస్థ సీనియర్ ఉద్యోగుల జీతాలను 15-35 శాతం మేర తగ్గించింది. అంతర్జాతీయంగా తిరిగి సాధారణ పరిస్థితులకు చేరుకునేందుకు అవసరమైన ప్రణాళికలతో సిద్ధంగా ఉన్నామని ఆయన పేర్కొన్నారు.