ఇండిగో సంస్థ ప్రత్యేక సలహాదారుగా గ్రెగ్ సారెట్‌స్కీ

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన కార్యకలాపాల నిర్వహణ, వాణిజ్య పరమైన మెరుగుదల అవకాశాల కోసం ప్రత్యేక సలహాదారుగా గ్రెగ్ సారెట్‌స్కీని నియమించినట్టు ఆదివారం ప్రకటించింది. ఈయన సంస్థ కార్యనిర్వాహక బృందంతో కలిసి పనిచేస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రెగ్ సారెట్‌స్కీ గతేడాది అక్టోబర్‌లో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. తాజాగా ఆయనను ప్రత్యేక సలహాదారుగా నియమిస్తున్నట్టు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో […]

Update: 2021-08-29 10:36 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో తన కార్యకలాపాల నిర్వహణ, వాణిజ్య పరమైన మెరుగుదల అవకాశాల కోసం ప్రత్యేక సలహాదారుగా గ్రెగ్ సారెట్‌స్కీని నియమించినట్టు ఆదివారం ప్రకటించింది. ఈయన సంస్థ కార్యనిర్వాహక బృందంతో కలిసి పనిచేస్తారని కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది. గ్రెగ్ సారెట్‌స్కీ గతేడాది అక్టోబర్‌లో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ బోర్డులో నాన్-ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా చేరారు. తాజాగా ఆయనను ప్రత్యేక సలహాదారుగా నియమిస్తున్నట్టు, ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది.

గ్రెగ్ నియామకం ద్వారా ఇండిగో వాణిజ్య అవకాశాలు వేగవంతమవుతాయని, దీనికోసం, ఆయన ఎగ్జిక్యూటివ్ లీడర్‌షిప్ టీమ్‌లో ఉన్న రొనొదత్తా, రాహుల్ భాటియాలతో కలిసి పనిచేయనున్నట్టు కంపెనీ తెలిపింది. రాహుల్ భాటియా ఇండిగో సంస్థ ప్రమోటర్‌గా ఉన్నారు. గ్రెగ్ సారెట్‌స్కీ 2010 మార్చి నుంచి 2018, మార్చి వరకు వెస్ట్‌జెట్(కెనడా) అధ్యక్షుడు, సీఈఓగా పనిచేశారు. అంతకుముందు అలస్కా ఎయిర్‌లైన్స్‌తో ఆయన కలిసి పనిచేశారు. తక్కువ ధర ఎయిర్‌లైన్స్ మోడల్‌పై గ్రెగ్‌కు ఉన్న అవగాహన సంస్థకెంతో ఉపయోగపడుతుంది. ఇండిగోను తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు, కొవిడ్ మహమ్మారి ప్రభావం నుంచి కోలుకునేందుకు ఆయనతో కలిసి పనిచేస్తామని’ కంపెనీ వెల్లడించింది.

Tags:    

Similar News