స్మార్ట్‌ఫోన్ అమ్మకాల్లో వృద్ధి

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్టోబర్ నెలకు సంబంధించి 42 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ గురువారం వెల్లడించింది. అక్టోబర్‌లో మొత్తం 2.1 కోట్ల యూనిట్ల ఎగుమతులు నమోదయ్యాయని, ఇది వరుసగా రెండో నెల అత్యధికమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఏడాది మొత్తానికి వినియోగదారుల అమ్మకాల్లో సింగిల్ డిజిట్ క్షీణతను నమోదవ్వొచ్చని ఐడీసీ పేర్కొంది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం..అక్టోబర్‌లో పలు ఆన్‌లైన్ వేదికల్లో అమ్మకాల సేల్ కారణంగా డిమాండ్ అధికంగా ఉందని […]

Update: 2020-12-17 10:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అక్టోబర్ నెలకు సంబంధించి 42 శాతం వృద్ధి సాధించిందని పరిశోధనా సంస్థ ఐడీసీ గురువారం వెల్లడించింది. అక్టోబర్‌లో మొత్తం 2.1 కోట్ల యూనిట్ల ఎగుమతులు నమోదయ్యాయని, ఇది వరుసగా రెండో నెల అత్యధికమని తెలిపింది. అయితే, ప్రస్తుత ఏడాది మొత్తానికి వినియోగదారుల అమ్మకాల్లో సింగిల్ డిజిట్ క్షీణతను నమోదవ్వొచ్చని ఐడీసీ పేర్కొంది. ఐడీసీ వెల్లడించిన వివరాల ప్రకారం..అక్టోబర్‌లో పలు ఆన్‌లైన్ వేదికల్లో అమ్మకాల సేల్ కారణంగా డిమాండ్ అధికంగా ఉందని తెలిపింది.

సెప్టెంబర్‌లో మొత్తం 2.3 కోట్ల యూనిట్ల అమ్మకాలతో ఆల్‌టైమ్ హైగా నిలించిందని ఐడీసీ స్పష్టం చేసింది. ఆన్‌లైన్ వేదికల్లో అమ్మకాలు 51 శాతం వాటాను నమోదు చేశాయని, ఆఫ్‌లైన్‌లో ముఖ్యంగా చిన్న పట్టణాలు, నగరాల్లో అమ్మకాలు 33 శాతం వృద్ధిని నమోదు చేశాయని ఐడీసీ పేర్కొంది. లో-మిడ్ రేంజ్ సెగ్మెంట్ అమ్మకాలు 60 శాతం పెరిగాయి. అక్టోబర్ నెలకు సంబంధించి ఇవి మొత్తం మార్కెట్లో 58 శాతానికి పెరిగింది. ప్రీమియం సెగ్మెంట్ కూడా మెరుగైన వృద్ధిని నమోదు చేశాయి. అక్టోబర్‌లో మార్కెట్ వాటా పరంగా చూస్తే..అత్యధికంగా షావోమీ 24.8 శాతం, శాంసంగ్ 20.6 శాతం, వివో 17.8 శాతం, రియల్‌మీ 13.8 శాతం, ఒప్పో 12.3 శాతాన్ని దక్కించుకున్నాయి.

Tags:    

Similar News