భారీగా పెరిగిన సెప్టెంబర్ నెల ఎగుమతులు

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 21.44 శాతం పెరిగి 54.06 బిలియన్ డాలర్ల(రూ. 4.06 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఈ ఎగుమతులు 2019, సెప్టెంబర్ కొవిడ్-19కి ముందు నమోదైన 26.03 శాతం వృద్ధి స్థాయిలో ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. సమీక్షించిన నెలలో దిగుమతులు 70 శాతం వృద్ధితో 68.49 బిలియన్ డాలర్లు(రూ. 5.14 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొవిడ్‌ నాటితో పోలిస్తే అధికంగా […]

Update: 2021-10-14 09:58 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత ఎగుమతులు ఈ ఏడాది సెప్టెంబర్‌లో వార్షిక ప్రాతిపదికన 21.44 శాతం పెరిగి 54.06 బిలియన్ డాలర్ల(రూ. 4.06 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఈ ఎగుమతులు 2019, సెప్టెంబర్ కొవిడ్-19కి ముందు నమోదైన 26.03 శాతం వృద్ధి స్థాయిలో ఉన్నాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడించాయి. సమీక్షించిన నెలలో దిగుమతులు 70 శాతం వృద్ధితో 68.49 బిలియన్ డాలర్లు(రూ. 5.14 లక్షల కోట్లకు పెరిగింది. ఇది కొవిడ్‌ నాటితో పోలిస్తే అధికంగా ఉంది. 2019, సెప్టెంబర్‌లో దిగుమతుల వృద్ధి 44.11 శాతం పెరిగాయి. సమీక్షించిన నెలలో సరుకుల ఎగుమతులు 22.63 శాతం పెరిగి 33.79 బిలియన్ డాలర్లు(రూ. 2.54 లక్షల కోట్లు)గా నమోదయ్యాయి. ఇంజనీరింగ్ వస్తువులు, పెట్రోలియం ఉత్పత్తుల రంగాల్లో పనితీరు మెరుగ్గా ఉండటంతో ఎగుమతులు గణనీయంగా పెరిగాయని గణాంకాలు పేర్కొన్నాయి. సెప్టెంబర్‌ నెలలో వాణిజ్య లోటు 22.59 బిలియన్ డాలర్ల(రూ. 1.69 లక్షల కోట్ల)కు పెరిగింది. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ మధ్య ఇప్పటివరకు ఎగుమతులు(సరుకులు, సేవలు కలిపి) 40.52 శాతం పెరిగి 312.47 బిలియన్ డాలర్ల(రూ. 23.49 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. ఇదే కాలంలో దిగుమతులు 64.91 శాతం వృద్ధితో 341.10 బిలియన్ డాలర్ల(రూ. 25.66 లక్షల కోట్ల)కు చేరుకున్నాయి. సెప్టెంబర్ నెలలో బంగారం దిగుమతులు 750 శాతం పెరిగి 5.11 బిలియన్ డాలర్లు(రూ. 38.44 వేల కోట్లు)గా నమోదయ్యాయి.

Tags:    

Similar News