జీఎస్‌పీ హోదాపై దిగొస్తున్న అమెరికా!
దిశ, సెంట్రల్ డెస్క్: ఇండియాకు గతంలో రద్దు చేసిన జనరలైజ్‌డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ)ని పునరుద్ధరించడాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఈ అంశంపై భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు, ఇండియా నుంచి సరైన ప్రతిపాదనలు వచ్చాక పునరుద్ధరణకు అవకాశాలుంటాయని తెలిపింది. ప్రస్తుతం చైనాతో వాణిజ్య యుద్ధం, ఇండియాతో అవసరం ఉన్న తరుణంలో అమెరికా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ చట్ట సభలో మాట్లాడిన ఓ ప్రతినిధి ఇండియా యాపిల్ పళ్లపై 70 శాతం సుంకాలను విధిస్తోందని, […]
దిశ, సెంట్రల్ డెస్క్: ఇండియాకు గతంలో రద్దు చేసిన జనరలైజ్‌డ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్స్(జీఎస్‌పీ)ని పునరుద్ధరించడాన్ని పరిశీలిస్తున్నట్టు అమెరికా పేర్కొంది. ఈ అంశంపై భారత్‌తో చర్చలు జరుపుతున్నట్టు, ఇండియా నుంచి సరైన ప్రతిపాదనలు వచ్చాక పునరుద్ధరణకు అవకాశాలుంటాయని తెలిపింది. ప్రస్తుతం చైనాతో వాణిజ్య యుద్ధం, ఇండియాతో అవసరం ఉన్న తరుణంలో అమెరికా ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. వాషింగ్టన్ చట్ట సభలో మాట్లాడిన ఓ ప్రతినిధి ఇండియా యాపిల్ పళ్లపై 70 శాతం సుంకాలను విధిస్తోందని, మరో ప్రతినిధి పప్పు దినుసులపై కూడా అధిక సుంకాలు విధిస్తోందని, దీనివల్ల అమెరికాలో ఉన్న రైతులకు నష్టాలు వస్తున్నాయని.. ఈ అధిక సుంకాల భారం తగ్గించేందుకు జీఎస్‌పీ పునరుద్ధరణ చేస్తే మంచిదని అభిప్రాయపడ్డారు. వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైటైజర్ ఈ అంశపై మాట్లాడుతూ.. జీఎస్‌పీ పునరుద్ధరణ వైపు చర్చలు జరుగుతున్నాయన్నారు. గతంలో జీఎస్‌పీ రద్దు వల్ల భారత్ అధికంగా సుంకాలను విధించిందని, ఇవి భారంగా మారాయని పునరుద్ధరణ చర్యలు తీసుకుంటే అమెరికా రైతులకు మేలు కలుగుతుందన్నారు. ముఖ్యంగా పప్పు దినుసులపై భారీ సుంకాల గురించి చట్టసభలో పలువురు ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు.