జీవనకాల గరిష్ఠానికి విదేశీ మారక నిల్వలు

ముంబయి: మన దేశ విదేశీ మారక ద్రవ్య నిలువలు(Country Foreign Exchange Reserves) జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. జూలై 31తో ముగిసిన చివరి వారంలో రికార్డుస్థాయిలో 11.938 బిలియన్ డాలర్లు (Billion dollars) చేకూరగా, మొత్తం విదేశీ మారక ద్రవ్య నిలువలు 534.568 బిలియన్ డాలర్లకు చేరాయి. ద్రవ్య విధాన కమిటీ(Monetary Policy Committee) మాస సమావేశం ముగిసన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ 13.4 నెలలకు సరిపోయే స్థాయిలో విదేశీ మారక ద్రవ్య […]

Update: 2020-08-08 08:07 GMT

ముంబయి: మన దేశ విదేశీ మారక ద్రవ్య నిలువలు(Country Foreign Exchange Reserves) జీవనకాల గరిష్ఠానికి చేరుకున్నాయి. జూలై 31తో ముగిసిన చివరి వారంలో రికార్డుస్థాయిలో 11.938 బిలియన్ డాలర్లు (Billion dollars) చేకూరగా, మొత్తం విదేశీ మారక ద్రవ్య నిలువలు 534.568 బిలియన్ డాలర్లకు చేరాయి.

ద్రవ్య విధాన కమిటీ(Monetary Policy Committee) మాస సమావేశం ముగిసన తర్వాత ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ మాట్లాడుతూ 13.4 నెలలకు సరిపోయే స్థాయిలో విదేశీ మారక ద్రవ్య నిలువలు ఉన్నాయని తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (Financial year) జూలై 31 వరకు నిల్వలు 56.8 బిలియన్ డాలర్లకు పెరిగాయని చెప్పారు.

జూలై 24తో ముగిసిన వారంలో నిల్వలు (Stock) 4.993 బిలియన్లు పెరిగి 522.630 బిలియన్లకు చేరుకున్నాయి. జూన్ 5తో ముగిసిన వారంతో మన దేశ విదేశీ మారక నిల్వలు రూ.50,000కోట్లకు చేరుకోవడం గమనార్హం. జూలై 31తో ముగిసిన వారంలో ఫారెన్ కరెన్సీ అసెట్స్(Foreign Currency Assets) సంపాదనతో విదేశీ మారక నిల్వలు పెరిగాలయి.

నిల్వలు పెరుగుదలలో ఎఫ్‌సీఏ( Foreign Currency Assets) కీలక భూమిక పోషిస్తాయి. గత నెల చివరి వారంలో ఎఫ్‌సీఏ 10.347 కోట్లు రావడంతో మొత్తం నిల్వల్లో ఇవి 490.829 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు(RBI Statistics) స్పష్టం చేస్తున్నాయి. జూలై 31తో ముగిసిన వారంలో బంగారం నిల్వలు(gold reserves) 1.525 బిలియన్ డాలర్లు పెరిగాయి.

విదేశీ మారక ద్రవ్య నిల్వలు(Foreign exchange reserves), బంగారం నిల్వలు (gold reserves) పెరగడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (International Monetary Fund)‌లో ప్రత్యేక నగదు పొందే హక్కులు 12 మిలియన్ డాలర్లు పెరిగి 1.475 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. జూలై 30తో ముగిసిన వారంతో ఐఎంఎఫ్‌(International Monetary Fund)లో దేశ నిల్వల స్థితి 54 మిలియన్లకు పెరిగి 4.639 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయని ఆర్‌బీఐ గణాంకాలు(RBI Statistics) స్పష్టం చేస్తున్నాయి.

Tags:    

Similar News