ఈ ఏడాది ఆర్థికవ్యవస్థ వృద్ధి 12 శాతం..!

దిశ, వెబ్‌డెస్క్ : దేశ ఆర్థికవ్యవస్థ 2021లో 12 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్థ మూడీస్ అనలిటిక్స్ శుక్రవారం వెల్లడించింది. 2020లో 7.1 శాతం క్షీణించిన తర్వాత ఆర్థికవ్యవస్థలో అవకాశాలు మరింత సానుకూలంగా మారాయని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీడీపీ వృద్ధి 2020-21 మొదటి రెండు త్రైమాసికాల్లో ప్రతికూలతను నమోదు చేసింది. అనంతరం డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం సానుకూలంగా ఉంది. దీంతో సమీప కాలంలో ఆర్థికవ్యవస్థకు మరింత అనుకూలంగా అవకాశాలు […]

Update: 2021-03-19 06:42 GMT

దిశ, వెబ్‌డెస్క్ : దేశ ఆర్థికవ్యవస్థ 2021లో 12 శాతం వృద్ధి సాధిస్తుందని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ సంస్థ మూడీస్ అనలిటిక్స్ శుక్రవారం వెల్లడించింది. 2020లో 7.1 శాతం క్షీణించిన తర్వాత ఆర్థికవ్యవస్థలో అవకాశాలు మరింత సానుకూలంగా మారాయని తెలిపింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో జీడీపీ వృద్ధి 2020-21 మొదటి రెండు త్రైమాసికాల్లో ప్రతికూలతను నమోదు చేసింది. అనంతరం డిసెంబర్ త్రైమాసికంలో 0.4 శాతం సానుకూలంగా ఉంది.

దీంతో సమీప కాలంలో ఆర్థికవ్యవస్థకు మరింత అనుకూలంగా అవకాశాలు ఉండొచ్చని మూడీస్ అభిప్రాయపడింది. లాక్‌డౌన్ ఆంక్షల సడలింపు తర్వాత దేశీయంగా డిమాండ్ మెరుగుపడుతోంది. వినియోగం, నాన్-రెసిడెన్షియల్ పెట్టుబడులు రాబోయే త్రైమాసికాల్లో పెరుగుతాయి. ఈ ప్రభావంతో 2021లో దేశీయ డిమాండ్ పునరుద్ధరణ పటిష్టమవుతుందని మూడీస్ పేర్కొంది.

‘2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రకటించిన వార్షిక బడ్జెట్, ద్రవ్యలోటు జీడీపీలో దాదాపు 7 శాతానికి పెరగడంలో తోడ్పడుతుందని ఆశిస్తున్నాం. ఇందులో మౌలిక సదుపాయాల అభివృద్ధికి అదనపు వ్యయం ఉండొచ్చు. అలాగే, రానున్న త్రైమాసికాల్లో ఉపాధి కల్పన కోసం అనుబంధ ప్రయోజనాలు ఉండొచ్చని’ మూడీస్ వెల్లడించింది. ఇటీవల పెరుగుతున్న కరోనా వైరస్‌ను నియంత్రించాలని, అదేవిధంగా దేశీయ పునరుద్ధరణ కొనసాగించడానికి వ్యాక్సిన్ అందించడం కీలకమని మూడీస్ అనలిటిక్స్ స్పష్టం చేసింది.

 

Tags:    

Similar News