చైనాలో భారత వెబ్‌సైట్లు బ్లాక్

భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనా కూడా భారత్‌కు సంబంధించిన పలు వెబ్ సైట్‌లను బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేయడంతో అక్కడ వైబ్ సైట్లను చూడటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం చైనాలో భారత్‌కు చెందిన ఐపీ టీవీ మాత్రమే ప్రసారమవుతున్నట్లు భారత దౌత్య వర్గాలు తెలిపాయి. కాగా, చైనాలో న్యూస్ […]

Update: 2020-06-30 05:29 GMT

భారత్- చైనా సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 59 చైనా యాప్‌లను సోమవారం నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో చైనా కూడా భారత్‌కు సంబంధించిన పలు వెబ్ సైట్‌లను బ్లాక్ చేసినట్లుగా తెలుస్తోంది. వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్ (వీపీఎన్) సర్వర్ల వ్యవస్థను నిలిపివేయడంతో అక్కడ వైబ్ సైట్లను చూడటానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో ప్రస్తుతం చైనాలో భారత్‌కు చెందిన ఐపీ టీవీ మాత్రమే ప్రసారమవుతున్నట్లు భారత దౌత్య వర్గాలు తెలిపాయి. కాగా, చైనాలో న్యూస్ ఛానల్స్, వార్తా ప్రసారాలపైనా, ప్రసార సంస్థలపైనా విపరీతమైన సెన్సార్ ఉంటుందన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News