రూ. 40కోట్ల జాక్‌పాట్ కొట్టిన కేరళ మ్యాన్
దిశ, ఫీచర్స్ : లక్కీ లాటరీల్లో లక్షలాది రూపాయలు గెలుచుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కేరళకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు అతడి సహచరులకు లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. యుఏఈలో ర్యాఫిల్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్(సుమారు రూ .40 కోట్లు) జాక్‌పాట్ గెలవడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు. కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్ ఉపాధి కోసం 2008లో అబుదాబి వెళ్లగా, అక్కడ డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అబుదాబిలో విక్రయించే లాటరీ పట్ల ఆకర్షితుడైన సోమరాజన్, గత […]
దిశ, ఫీచర్స్ : లక్కీ లాటరీల్లో లక్షలాది రూపాయలు గెలుచుకోవడం చూస్తూనే ఉన్నాం. తాజాగా కేరళకు చెందిన ఓ ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు అతడి సహచరులకు లాటరీ రూపంలో అదృష్టం కలిసివచ్చింది. యుఏఈలో ర్యాఫిల్ డ్రాలో 20 మిలియన్ దిర్హామ్(సుమారు రూ .40 కోట్లు) జాక్‌పాట్ గెలవడంతో రాత్రికిరాత్రే కోటీశ్వరుడయ్యాడు.
కేరళకు చెందిన రెంజిత్ సోమరాజన్ ఉపాధి కోసం 2008లో అబుదాబి వెళ్లగా, అక్కడ డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. అబుదాబిలో విక్రయించే లాటరీ పట్ల ఆకర్షితుడైన సోమరాజన్, గత మూడు నాలుగేళ్ల నుంచి టికెట్లు కొంటున్నాడు. ఈ క్రమంలోనే 9మంది స్నేహితులతో కలిసి 100 దిర్హామ్‌లతో లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. తాజాగా నిర్వహించిన డ్రాలో ఆ టికెట్‌కు 3 కోట్ల దిర్హమ్‌లు (దాదాపు 40 కోట్లు) వరించడంతో సోమరాజన్ మూడేళ్ల కల ఫలించింది. తన సహచరుల్లో భారత్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్ వ్యక్తులు ఉన్నారని, వచ్చే మొత్తాన్ని అందరం సమానంగా పంచుకుంటామని తెలిపాడు.
‘నేను పదమూడేళ్లుగా ఇక్కడే ఉండి నా కుటుంబం కోసం కష్టపడుతున్నాను. దుబాయ్ టాక్సీతో పాటు వివిధ సంస్థలలో డ్రైవర్‌గా పనిచేశాను. గత సంవత్సరం ఒక సంస్థలో డ్రైవర్ కమ్ సేల్స్‌మన్‌గా పనిచేశాను. కానీ కరోనా వల్ల నా జీతం తగ్గించారు. దాంతో కష్టమైన జీవితం గడిపాను. ఇదే సమయంలో మరోసారి నా అదృష్టం పరీక్షించుకునేందుకు నా స్నేహితులతో కలిసి ‘రెండు టికెట్లు కొంటే ఒకటి ఫ్రీ’ ఆఫర్ కింద టికెట్ తీసుకున్నాము. ప్రతి వ్యక్తి 100 దిర్హామ్‌లను పూల్ చేశాడు. ఎన్నో రోజుల నుంచి లాటరీ వస్తుందనే ఆశతో ఉన్నాను. అది నిజమైంది. మాటల్లో చెప్పలేనంత సంతోషంగా ఉంది’ అని సోమరాజన్ తెలిపాడు.