మలేషియాలో భారతీయుడు జైలుపాలు  

దిశ, వెబ్ డెస్క్: 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఉత్తర్వును ఉల్లంఘించినందుకు 57 ఏళ్ల భారతీయ రెస్టారెంట్ యజమానికి మలేషియాలో ఐదు నెలల జైలు శిక్ష పడింది. కరోనా బారిన పడిన ఇతను క్వారంటైన్ (quarantine)లో ఉండకుండా రెస్టారెంట్ కి వెళ్లిన కారణంగా… అతనిని కాంటాక్ట్ అయినవారు కూడా COVID-19 బారిన పడ్డారు. వ్యాధి సోకిన వారిలో రెస్టారెంట్ యజమాని కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ స్టాఫ్, కస్టమర్లు ఉన్నారు. సదరు యజమానిని కాంటాక్ట్ అయినవారు మరో మూడు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడ కూడా […]

Update: 2020-08-13 09:57 GMT

దిశ, వెబ్ డెస్క్: 14 రోజుల క్వారంటైన్ నిబంధన ఉత్తర్వును ఉల్లంఘించినందుకు 57 ఏళ్ల భారతీయ రెస్టారెంట్ యజమానికి మలేషియాలో ఐదు నెలల జైలు శిక్ష పడింది. కరోనా బారిన పడిన ఇతను క్వారంటైన్ (quarantine)లో ఉండకుండా రెస్టారెంట్ కి వెళ్లిన కారణంగా… అతనిని కాంటాక్ట్ అయినవారు కూడా COVID-19 బారిన పడ్డారు.

వ్యాధి సోకిన వారిలో రెస్టారెంట్ యజమాని కుటుంబ సభ్యులు, రెస్టారెంట్ స్టాఫ్, కస్టమర్లు ఉన్నారు. సదరు యజమానిని కాంటాక్ట్ అయినవారు మరో మూడు రాష్ట్రాలకు చెందినవారు కావడంతో అక్కడ కూడా కేసులు నమోదయ్యాయి.

Tags:    

Similar News