100 బిలియన్ డాలర్లకు ఒక్క అడుగు దూరంలో దేశీయ ఐటీ సేవలు!

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సంస్థల సమాఖ్య నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీఎసెస్ కంపెనీస్(నాస్కామ్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ పరిశ్రమ పనితీరును వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..కరోనా మహమ్మారి అనిశ్చితి ఉన్నప్పటికీ, ఐటీ పరిశ్రమ వార్షిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధి సాధించింది. ఆదాయాలు అంతకుముందు ఏడాదికి సుమారు రూ. 14 లక్షల కోట్ల నుంచి 2020లో రూ. 14.35 లక్షల కోట్లకు పెరిగాయి. ఐటీ ఎగుమతులు సుమారు రూ. 10.50 లక్షల […]

Update: 2021-02-15 09:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఐటీ సంస్థల సమాఖ్య నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీఎసెస్ కంపెనీస్(నాస్కామ్) 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఐటీ పరిశ్రమ పనితీరును వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం..కరోనా మహమ్మారి అనిశ్చితి ఉన్నప్పటికీ, ఐటీ పరిశ్రమ వార్షిక ప్రాతిపదికన 2.3 శాతం వృద్ధి సాధించింది. ఆదాయాలు అంతకుముందు ఏడాదికి సుమారు రూ. 14 లక్షల కోట్ల నుంచి 2020లో రూ. 14.35 లక్షల కోట్లకు పెరిగాయి. ఐటీ ఎగుమతులు సుమారు రూ. 10.50 లక్షల కోట్ల నుంచి రూ. 11 లక్షల కోట్లకు పెరిగాయి. దేశీయ డిమాండ్ సైతం అంతకుముందు రూ. 3 లక్షల కోట్ల నుంచి రూ. 3.3 లక్షల కోట్లకు పెరిగింది.

పరిశ్రమ మొత్తం ఆదాయంలో హార్డ్‌వేర్ విభాగం 4.1 శాతం వృద్ధిని సాధించగా, ఐటీ సేవల పరిమాణం 100 బిలియన్ డాలర్లకు చేరుకునేందుకు కేవలం ఒక్క బిలియన్ వెనకబడి ఉంది. సాఫ్ట్‌వేర్ ఉత్పత్తులు 2.7 శాతం వార్షిక వృద్ధిని సాధిస్తున్నాయని నివేదిక వెల్లడించింది. ‘పరిశ్రమ స్థిరంగా, సంక్షోభం నుంచి మరింత మెలకువగా ముందుకెళ్తున్నాము. కరోనాతో పోరాడేందుకు, తద్వారా దేశాన్ని పునరుద్ధరన వైపు నడిపించడంలో కీలకంగా వ్యవహరిస్తున్నామని’ నాస్కామ్ అధ్యక్షుడు దేబ్జనీ ఘోష్ చెప్పారు. జీడీపీలో 8 శాతం, భారత్ నుంచి సేవల ఎగుమతుల్లో 52 శాతం వాటాతో ఐటీ పరిశ్రమ 2020-21లో 1,38,000 కొత్త నియామకాలను చేపట్టింది. మొత్తం పరిశ్రమ శ్రామిక శక్తి ఇప్పుడు 44.7 లక్షలకు చేరుకుంది. డిజిటల్ ఆదాయాలు మొత్తం పరిశ్రమ ఆదాయంలో మూడో వంతును కలిగి ఉన్నాయని ఆయన వివరించారు.

Tags:    

Similar News