‘ఇండియన్ ఐడల్ 12 ’ కాంట్రవర్సీ.. సోనూ నిగమ్ స్టేట్‌మెంట్
దిశ, సినిమా : టాలెంట్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ రోజుకో కాంట్రవర్సీ ఎదుర్కొంటోంది. ఒక్కో రోజు, ఒక్కో సెలబ్రిటీ, ఒక్కో రకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. సింగర్ అమిత్ కుమార్ తన తండ్రి కిశోర్ కుమార్ స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా హాజరు కాగా.. కంటెస్టెంట్స్ ఎలా పాడినా సరే పాజిటివ్ కామెంట్స్ ఇవ్వాలని మేకర్స్ సూచించారని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే సింగర్ సునిధి […]
దిశ, సినిమా : టాలెంట్ షో ‘ఇండియన్ ఐడల్ 12’ రోజుకో కాంట్రవర్సీ ఎదుర్కొంటోంది. ఒక్కో రోజు, ఒక్కో సెలబ్రిటీ, ఒక్కో రకంగా స్టేట్‌మెంట్ ఇస్తున్నారు. సింగర్ అమిత్ కుమార్ తన తండ్రి కిశోర్ కుమార్ స్పెషల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా హాజరు కాగా.. కంటెస్టెంట్స్ ఎలా పాడినా సరే పాజిటివ్ కామెంట్స్ ఇవ్వాలని మేకర్స్ సూచించారని వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ షాకింగ్ కామెంట్స్‌ను కొందరు వ్యతిరేకించగా.. మరికొందరు సపోర్ట్ చేశారు. ఈ క్రమంలోనే సింగర్ సునిధి చౌహాన్ కూడా అమిత్ కుమార్ చెప్పింది నిజమేనని, ఇండియన్ ఐడల్ స్టాండర్డ్స్ పడిపోయాయని రెండ్రోజుల క్రితం స్టేట్‌మెంట్ ఇచ్చింది. తాజాగా ఈ కాంట్రవర్సీపై స్పందించిన సింగర్ సోనూ నిగమ్.. దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని కోరాడు.
ఈ విషయంలో అటు సింగర్ అమిత్ కుమార్, ఇటు ఇండియన్ ఐడల్ నిర్వాహకులు ఇద్దరిదీ తప్పులేదని వివరించాడు. కిశోర్ కుమార్ సాంగ్స్‌కు ఎవరూ న్యాయం చేయలేరని, తన కొడుకు అమిత్ కుమార్ మంచి వ్యక్తి అని, తనను గౌరవించాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన ఒపీనియన్‌ను పాజిటివ్‌గా తీసుకోవాల్సిందిగా తనకు వ్యతిరేకంగా మాట్లాడిన ఆదిత్య నారాయణ్, మనోజ్‌లకు సూచించారు. సీనియర్ విమర్శించినా సరే, వారు ఎందుకలా చెప్తున్నారో అర్థం చేసుకుని స్కిల్స్ పెంచుకునే ప్రయత్నించాలని కోరాడు. ఇక ‘ఇండియన్ ఐడల్ 12’ నిర్వాహకులు కూడా తమ షో గురించి పాజిటివిటీ పెంచేందుకు అలా చేయడంలో తప్పులేదన్నాడు సోనూ నిగమ్.