'భారత హాకీ జట్టు కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొంటుంది'

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జూలైలో కామన్వెల్త్ గేమ్స్ 2022 నిర్వహించనున్నారు. అయితే ఈ గేమ్స్‌లో భారత హాకీ జట్టు పాల్గొనబోదని గతంలో హాకీ ఇండియా ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత కొన్ని రోజులకే చైనాలోని హాంగ్జోలో ఏసియన్స్ జరుగనున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ ఆడి వెంటనే ఏసియన్ గేమ్స్‌కు వెళ్లడం కష్టమవుతుందని భావించింది. అంతే కాకుండా 2024 పారీస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఆసియన్ గేమ్స్ ముఖ్యం. దీంతో […]

Update: 2021-12-04 11:40 GMT

దిశ, స్పోర్ట్స్: ఇంగ్లాండ్ వేదికగా వచ్చే ఏడాది జూలైలో కామన్వెల్త్ గేమ్స్ 2022 నిర్వహించనున్నారు. అయితే ఈ గేమ్స్‌లో భారత హాకీ జట్టు పాల్గొనబోదని గతంలో హాకీ ఇండియా ప్రకటించింది. కామన్వెల్త్ గేమ్స్ ముగిసిన తర్వాత కొన్ని రోజులకే చైనాలోని హాంగ్జోలో ఏసియన్స్ జరుగనున్నాయి. కరోనా ఆంక్షల నేపథ్యంలో కామన్వెల్త్ గేమ్స్ ఆడి వెంటనే ఏసియన్ గేమ్స్‌కు వెళ్లడం కష్టమవుతుందని భావించింది. అంతే కాకుండా 2024 పారీస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాలంటే ఆసియన్ గేమ్స్ ముఖ్యం. దీంతో కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనబోమంటూ గతంలో ప్రకటించింది.

అయితే తాజాగా ఆ నిర్ణయాన్ని హాకీ ఇండియా వెనక్కి తీసుకున్నట్లు కామన్వెల్త్ గేమ్స్ ఫెడరేషన్ అధికారి వెల్లడించారు. ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షుడు నరీందర్ బాత్రా, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కలసి హాకీ ఇండియాతో చర్చలు జరిపారు. రెండు ఈవెంట్లలో పాల్గొనేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తామని.. ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరఫున సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో హాకీ ఇండియా కూడా అంగీకరించి జట్టును పంపాలని నిర్ణయించింది. కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్‌ హోమ్‌లో 2022 జులై 28 నుంచి అగస్టు 8 వరకు, ఆసియన్ గేమ్స్ సెప్టెంబర్ 8 నుంచి చైనాలో జరుగనున్నాయి.

Tags:    

Similar News