ఐసీయూ నుంచి సెమీస్‌ ఆడేలా చేశాడు.. భారత వైద్యుడికి రిజ్వాన్ స్పెషల్ గిఫ్ట్

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్‌ మ్యాచుల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌కు సరిగ్గా 48 గంటల ముందు చాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఐసీయూ వార్డులో చికిత్స తీసుకుంటున్న పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌.. సెమీస్‌కి 24 గంటల ముందు డిశ్చార్జి అయ్యాడు. దీంతో డాక్టర్లు పర్యవేక్షణలో ఉండమని చెప్పినప్పటికీ.. జట్టు కోసం రిస్క్ చేసి మ్యాచ్‌ ఆడాడు. 52 బంతుల్లో 67 పరుగులతో […]

Update: 2021-11-13 07:15 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా గ్రూప్‌ మ్యాచుల్లో అదరగొట్టిన పాకిస్తాన్‌ సెమీస్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యచ్‌కు సరిగ్గా 48 గంటల ముందు చాతిలో ఇన్‌ఫెక్షన్ కారణంగా ఐసీయూ వార్డులో చికిత్స తీసుకుంటున్న పాక్ ఓపెనర్ మహమ్మద్ రిజ్వాన్‌.. సెమీస్‌కి 24 గంటల ముందు డిశ్చార్జి అయ్యాడు. దీంతో డాక్టర్లు పర్యవేక్షణలో ఉండమని చెప్పినప్పటికీ.. జట్టు కోసం రిస్క్ చేసి మ్యాచ్‌ ఆడాడు. 52 బంతుల్లో 67 పరుగులతో టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. కానీ, ఈ మ్యచ్‌లో ఆస్ట్రేలియా విజయతీరాలకు చేరింది.

అయినప్పటికీ.. గ్రేట్ జాబ్ అంటూ రిజ్వాన్‌పై సోషల్ మీడియాలో ప్రశంసలు మొదలయ్యాయి. ప్రాణాలను పక్కనబెట్టి జట్టు కోసం పోరాటం చేశాడని క్రికెటర్లు అభినందించారు. ఇక మహమ్మద్ రిజ్వాన్ ఈ విషయంపై స్పందించకపోయినా.. అతడు త్వరగా కోలుకునేలా వైద్యం అందించిన భారతీయ డాక్టర్‌కు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చాడు. ఆసీస్‌ మ్యాచ్‌లో ఓటమి అనంతరం నేరుగా వైద్యుడు సహీర్ సైనలబ్దీన్ వద్దకు వెళ్లి త్వరగా ఫిట్‌గా తయారు చేశావని.. నా తరఫున ఈ కానుక తీసుకోండి అంటూ తన జెర్సీని అందజేశాడు. ఈ జెర్సీని చూపుతూ సంతోషం వ్యక్తం చేసిన సదరు డాక్టర్.. ఫొటోను తన సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేయగా తెగ వైరల్ అవుతోంది.

Tags:    

Similar News