ఆ ప్రతిపాదన బ్యాడ్ ఐడియా: రఘురామ్ రాజన్
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశానికి అనుమతిని సూచిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంతర్గత కమిటీ ఇచ్చిన ప్రతిపాదన ‘బ్యాడ్ ఐడియా’ అని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య అన్నారు. ఇద్దరూ కలిసి రాసిన ఓ వ్యాసంలో ఈ అంశంపై స్పందిస్తూ..బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ ప్రమేయంపై కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. ఆర్‌బీఐ తన అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక […]
దిశ, వెబ్‌డెస్క్: బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థల ప్రవేశానికి అనుమతిని సూచిస్తూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) అంతర్గత కమిటీ ఇచ్చిన ప్రతిపాదన ‘బ్యాడ్ ఐడియా’ అని మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్, డిప్యూటీ గవర్నర్ వైరల్ ఆచార్య అన్నారు. ఇద్దరూ కలిసి రాసిన ఓ వ్యాసంలో ఈ అంశంపై స్పందిస్తూ..బ్యాంకింగ్ రంగంలో కార్పొరేట్ ప్రమేయంపై కొన్ని పరిమితులకు కట్టుబడి ఉండటం చాలా ముఖ్యం అని చెప్పారు. ఆర్‌బీఐ తన అంతర్గత కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రైవేట్ బ్యాంకుల లైసెన్సింగ్ విధానాన్ని సరిదిద్దాలని సూచించింది.
ఇందులో భాగంగా కార్పొరేట్ సంస్థలకు బ్యాంకులు నిర్వహించేలా అనుమతివ్వడం. ప్రమోటర్లు అధిక వాటాను కలిగి ఉండేందుకూ, పెద్ద ఎబ్‌బీఎఫ్‌సీలను బ్యాంకులుగా మారేందుకు అనుమతివ్వడం లాంటి ప్రతిపాదనలను ఇచ్చారు. కార్పొరేట్ సంస్థలకు బ్యాంకుల అనుమతి లభిస్తే గనక, ముందుగా కార్పొరేట్ సంస్థలు సులభంగా రుణాలను పొందగలవు. దీనివల్ల బ్యాంకు రుణాల చరిత్ర వినాశకరమవుతుందని వ్యాసంలో స్పష్టం చేశారు. రెండో కారణంగా, బ్యాంకింగ్ రంగంలోకి కార్పొరేట్ సంస్థలు ప్రవేశించడం ద్వారా.. ఆర్‌బీఐ బ్యాంకింగ్ లైసెన్సులను న్యాయనా కేటాయించినప్పటికీ ఇప్పటికే మెరుగైన మూలధనాన్ని కలిగి ఉన్న బడా కంపెనీలు అనవసరమైన ప్రయోజనాలను వారు పొందే వీలుంటుందని హెచ్చరించారు.