కరోనా కాలంలో పెళ్లి చేసుకున్న ఆర్చరీ జంట

దిశ, స్పోర్ట్స్: భారత ఆర్చర్లు దీపిక కుమారి, అతానుదాస్ మంగళవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ల క్రితమే ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. దీంతో భౌతిక దూరం పాటిస్తూ, లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ రాంచీలోని మొరాబాదిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకుంటున్నామని […]

Update: 2020-07-01 08:32 GMT

దిశ, స్పోర్ట్స్: భారత ఆర్చర్లు దీపిక కుమారి, అతానుదాస్ మంగళవారం వివాహ బంధంతో ఒక్కటయ్యారు. రెండేళ్ల క్రితమే ఈ జంట ఎంగేజ్‌మెంట్ చేసుకుంది. కానీ, టోక్యో ఒలింపిక్స్ అనంతరం వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఒలింపిక్స్ ఏడాదిపాటు వాయిదా పడ్డాయి. దీంతో భౌతిక దూరం పాటిస్తూ, లాక్‌డౌన్ నిబంధనలు అనుసరిస్తూ రాంచీలోని మొరాబాదిలో వివాహం చేసుకున్నారు. వీరి వివాహానికి ఝార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్, దగ్గరి బంధువులు మాత్రమే హాజరయ్యారు. తాము పెళ్లి చేసుకుంటున్నామని గతవారం దీపిక ప్రకటించారు. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ ప్రభుత్వ నిబంధనలకి లోబడి వివాహం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ వివాహానికి మీడియా, తోటి ఆర్చర్లకి ఆహ్వానం అందలేదు.

Tags:    

Similar News