Big Match : నేడు పాకిస్థాన్‌తో భారత్ ఢీ.. గెలుపెవరిది.?

దిశ, వెబ్‌డెస్క్ : నేడు(డిసెంబర్ 17) ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. శుక్రవారం జరిగే రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఇండియా జట్టు పోరుకు రెడీ అయింది. అయితే గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0తో గెలిచిన భారత్.. ఈరోజు మ్యాచ్‌లో కూడా అలాంటి ప్రదర్శన చేయాలని చూస్తోంది. ఇదిలా ఉండగా 2018 మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడం వల్ల ట్రోఫీని […]

Update: 2021-12-16 20:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : నేడు(డిసెంబర్ 17) ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నమెంట్‌లో భారత హాకీ జట్టు పాకిస్థాన్‌తో తలపడనుంది. శుక్రవారం జరిగే రౌండ్‌ రాబిన్‌ లీగ్‌ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఇండియా జట్టు పోరుకు రెడీ అయింది. అయితే గత మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 9-0తో గెలిచిన భారత్.. ఈరోజు మ్యాచ్‌లో కూడా అలాంటి ప్రదర్శన చేయాలని చూస్తోంది.

ఇదిలా ఉండగా 2018 మస్కట్‌లో జరిగిన టోర్నీ ఫైనల్‌ వర్షం కారణంగా రద్దవడం వల్ల ట్రోఫీని పంచుకున్న భారత్‌-పాక్‌ జట్లు డిఫెండింగ్‌ ఛాంపియన్ల హోదాలో ఈసారి బరిలో దిగడం విశేషం. ఈ నేపథ్యంలో ఇరు ఛాంపియన్‌ జట్ల మధ్య జరిగే పోరు మరింత ఆసక్తిని రేపుతోంది.

కానీ, ఛాంపియన్స్‌ ట్రోఫీలో రికార్డు మాత్రం పాక్‌ జట్టుకు అనుకూలంగా ఉంది. ఈ టోర్నీ ఫైనల్లో భారత్‌-పాక్‌ తొమ్మిదిసార్లు తలపడితే పాక్‌ ఏడుసార్లు విజయం సాధించగా.. భారత్‌ రెండు సార్లు పైచేయి సాధించింది.

Tags:    

Similar News