తడబడ్డ భారత ఆటగాళ్లు.. ఇంగ్లాండ్ టార్గెట్ @124

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. ఇంగ్లండ్ ఎదుట 125 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మొదటగా టాస్ ఓడీ బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మొత్తంగా 7 వికెట్లను కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్(67) అర్థసెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే… ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధవన్(4) వరుస ఓవర్లలో […]

Update: 2021-03-12 10:01 GMT

దిశ, వెబ్‌డెస్క్: నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ఇండియా-ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న తొలి టీ20లో టీమిండియా ఆటగాళ్లు తడబడ్డారు. ఇంగ్లండ్ ఎదుట 125 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. మొదటగా టాస్ ఓడీ బ్యాటింగ్‌కు దిగిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో మొత్తంగా 7 వికెట్లను కోల్పోయి 124 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్(67) అర్థసెంచరీతో అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అయితే… ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధవన్(4) వరుస ఓవర్లలో అవుట్ కావడం, కెప్టెన్ విరాట్ కోహ్లీ(0) వరుసగా పెవీలియన్ చేరడంతో జట్టు తీవ్ర కష్టాల్లోకి వెళ్లింది. రిషబ్ పంత్(21) కొంత సేపు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడినా.. స్టోక్స్ బాల్‌‌కు దొరికిపోయాడు. ఆ తరువాత హార్దిక్ పాండ్యా(19), శార్దూల్ ఠాకూర్(0) కూడా అవుట్ కావడంతో కేవలం 102 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఇక చివర్లో అయ్యర్ కూడా సిక్స్ కొట్టబోయి థర్డ్ మ్యాన్ వద్ద డేవిడ్ మలాన్‌కు దొరికిపోయాడు. దీంతో మొత్తంగా భారత్ 20 ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 124 పరుగులు చేయగలిగింది.

Tags:    

Similar News