Bigg Boss: కాలికి కట్టుతో దర్శనమిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ.. ఆందోళనలో ఫ్యాన్స్(పోస్ట్)
నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ‘మహర్షి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.
దిశ, సినిమా: నటి దివి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె ‘మహర్షి’ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత బిగ్ బాస్ సీజన్-4కి కంటెస్టెంట్‌గా హౌస్‌లోకి అడుగుపెట్టింది. అక్కడ తన అందం, ఆటతో ప్రేక్షకులను మెప్పించింది. కానీ ఫైనల్ వరకు వెళ్లలేకపోయింది. ఇక బయటికి వచ్చాక.. చిన్న సినిమాల్లో హీరోయిన్‌గా, పెద్ద పెద్ద చిత్రాల్లో, సిరీస్‌లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తుంది. అలాగే నిత్యం సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉంటూ తన అందాలను ఆరబోస్తూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా దివి తన ఇన్‌స్టా వేదికగా ఓ పోస్ట్ పెట్టింది.
అందులో కాలికి కట్టుతో ఉన్న పిక్‌ను షేర్ చేస్తూ.. ‘కొన్నిసార్లు మన పనిని కాలు మీద ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టు ఆపేస్తుంది కానీ మనం మన ఎంటర్టైన్మెంట్‌ని ఎందుకు ఆపాలి. అందుకే ఈ కట్టుని నాకు అడ్డంకిగా చూడకుండా బొమ్మలు గీస్తూ అందంగా తయారు చేస్తున్నాను. జీవితం అంటే కష్టాలను తప్పించుకోవడం కాదు. ఇలాంటి సమయంలో కూడా నవ్వాలి. అందుకే నేను ఇక్కడ ఉన్నాను. నా ప్రతి సెకండ్‌ని ఆస్వాదిస్తున్నాను. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. ప్రతిదానిలో ఆనందం వెతుక్కుందాం’ అనే క్యాప్షన్‌ను జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్త వైరల్‌గా మారింది. ఇక దీనిని చూసిన నెటిజన్లు అయ్యో దివికి ఏమైంది, గెట్ వెల్ సూన్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.