2050లో ఆ స్థానంలో భారత్

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్ రానున్న 30 ఏళ్లలో జపాన్‌ను దాటేసి 3వ స్థానానికి ఎగబాకుతుందని ప్రముఖ మెడికల్ మేగజైన్ లాన్సెట్ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాతి స్థానంలో భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది. 2050 నాటికి జర్మనీ, జపాన్ దేశాలను దాటి భారత్ 3వ స్థానానికి చేరుకోవచ్చని, 2100 ఏడాదికి సైతం 3వ స్థానంలోనే కొనసాగే అవకాశాలున్నట్టు […]

Update: 2020-10-11 07:39 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానంలో ఉన్న భారత్ రానున్న 30 ఏళ్లలో జపాన్‌ను దాటేసి 3వ స్థానానికి ఎగబాకుతుందని ప్రముఖ మెడికల్ మేగజైన్ లాన్సెట్ నివేదిక అంచనా వేసింది. ప్రస్తుతం అమెరికా, చైనా, జపాన్, జర్మనీ దేశాల తర్వాతి స్థానంలో భారత్ ఐదో ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతోంది.

2050 నాటికి జర్మనీ, జపాన్ దేశాలను దాటి భారత్ 3వ స్థానానికి చేరుకోవచ్చని, 2100 ఏడాదికి సైతం 3వ స్థానంలోనే కొనసాగే అవకాశాలున్నట్టు నివేదిక అభిప్రాయపడింది. 2017 ఏడాదికి ప్రపంచ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల్లో భారత్ 7వ స్థానంలో ఉన్న నేపథ్యంలో ఆ ఏడాది ప్రాతిపదికన లాన్సెట్ నివేదిక తాజా అంచనాలను వెలువరించింది. 2030 నాటికి అమెరికా, చైనా, జపాన్ తర్వాత 4వ స్థానానికి చేరుకుంటుందని, 2050 నాటికి జపాన్‌ను దాటి 3వ స్థానానికి చేరుకుంటుందని నివేదిక తెలిపింది.

ప్రస్తుతం భారత్ 5వ స్థానంలో ఉండగా, 6వ స్థానంలో బ్రిటన్, 7వ స్థానంలో ఫ్రాన్స్ దేశాలున్నాయి. భారత్ సైతం ఇదే లక్ష్యంతో ఉంది. 2047 నాటికి భారత్ ప్రపంచ 3వ ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని నీతి అయోగ్ ఛైర్మన్ రాజీవ్ కుమారు చెప్పారు. అయితే, ఈ ఏడాది కొవిడ్-19 ప్రభావం కారణంగా గత అంచనాలు తగ్గాయి. గతేడాది జపాన్ ఎకనామిక్ రీసెర్చ్ ప్రకారం..2029 నాటికి జపాన్‌ను దాటి భారత్ మూడో స్థానానికి చేరుకుంటుందని అంచనా వేయగా కరోనా వల్ల ఇది ఆలస్యమవనున్నది.

అంతేకాకుండా, 2025 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు కూడా ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయని నివేదిక పేర్కొంది. పలు దేశాల్లో ఉన్న శ్రామిక జనాభా ఆధారంగా జీడీపీలో వచ్చే మార్పులను పరిగణలోకి తీసుకుని లాన్సెట్ ఈ అంచనాలను వెలువరించినట్టు తెలిపింది. భవిష్యత్తులో చైనాతో పాటు భారత్‌లో శ్రామిక జనాభా గణానీయమైన తరుగుదల నమోదు చేస్తుందని, అయితే, శ్రామికుల సంఖ్యా పరనా భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుందని వెల్లడించింది. 2100 సమయానికి భారత్‌లో అత్యధిక సంఖ్యలో శ్రామికులు ఉంటారని పేర్కొంది.

Tags:    

Similar News