టాప్‌లోనే ఇండియా
వరుసగా వెస్ట్‌ఇండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా తొలిసారి రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన భారత జట్టు 7 మ్యాచుల్లో విజయం సాధించింది. కివీస్ పర్యటనకు ముందు 360 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమ్ఇండియా ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 10 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 7 విజయాలతో 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇండియాతో సిరీస్‌కు ముందు కేవలం 60 […]
వరుసగా వెస్ట్‌ఇండీస్, బంగ్లాదేశ్, దక్షిణాఫ్రికాలను ఓడించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన టీమ్ఇండియా తొలిసారి రెండు మ్యాచుల టెస్టు సిరీస్‌ను ఓడిపోయింది. ఇప్పటివరకు 9 మ్యాచులు ఆడిన భారత జట్టు 7 మ్యాచుల్లో విజయం సాధించింది. కివీస్ పర్యటనకు ముందు 360 పాయింట్లతో టాప్‌లో ఉన్న టీమ్ఇండియా ఇప్పటికీ అగ్రస్థానంలోనే కొనసాగుతోంది. 10 మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా జట్టు 7 విజయాలతో 296 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇక ఇండియాతో సిరీస్‌కు ముందు కేవలం 60 పాయింట్లతో ఉన్న కివీస్ జట్టు రెండు మ్యాచులు గెలిచి 180 పాయింట్లతో మూడో స్థానానికి చేరుకుంది.
ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ టేబుల్
దేశం ఆడిన మ్యాచులు గెలిచినవి పాయింట్లు
ఇండియా 9 7 360
ఆస్ట్రేలియా 10 7 296
న్యూజిలాండ్ 7 3 180
ఇంగ్లాండ్ 9 5 146
పాకిస్తాన్ 5 2 140
శ్రీలంక 4 1 80
దక్షిణాఫ్రికా 7 1 24
వెస్ట్‌ఇండిస్ 2 0 0
బంగ్లాదేశ్ 3 0 0
tags : indian cricket team, still top in championship table