భారత్‌లో మళ్లీ విజృంభిస్తున్న కరోనా

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 43,733 కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ సోకిన వారి సంఖ్య 3,06,63,665కి చేరింది. నిన్న ఒక్కరోజే 930 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,04,211కి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 47,240 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,97,99,534 మంది […]

Update: 2021-07-06 23:17 GMT

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. గత 24 గంటల్లో నమోదైన కేసుల వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బుధవారం హెల్త్‌ బులెటిన్‌లో వెల్లడించింది. తాజాగా దేశ వ్యాప్తంగా 43,733 కేసులు నమోదు కాగా.. మొత్తం పాజిటివ్ సోకిన వారి సంఖ్య 3,06,63,665కి చేరింది. నిన్న ఒక్కరోజే 930 మంది మరణించగా.. మృతుల సంఖ్య 4,04,211కి పెరిగింది. మంగళవారం ఒక్కరోజే 47,240 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటివరకు 2,97,99,534 మంది ఆస్పత్రుల నుంచి పూర్తి ఆరోగ్యంతో ఇండ్లకు చేరారు. ప్రస్తుతం దేశంలో 4,59,920 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వ్యాక్సినేషన్‌ ప్రక్రియలో భాగంగా 36,13,23,548 మంది వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులెటిన్‌లో స్పష్టం చేసింది.

Tags:    

Similar News