భారత్‌లో కొత్తగా 1,32,788 కరోనా కేసులు
దిశ, వెబ్డెస్క్ : భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,207 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,31,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా […]
దిశ, వెబ్డెస్క్ : భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుతున్నాయి. ఇదే సమయంలో మరణాల సంఖ్య ఆందోళనకరంగా మారుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసిన బులిటెన్ ప్రకారం.. దేశంలో తాజాగా 1,32,788 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,83,07,832కు చేరింది. ఇక కరోనాతో నిన్న ఒక్కరోజే 3,207 మంది మరణించారు. గత 24 గంటల్లో 2,31,456 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దేశంలో కరోనా మరణాల సంఖ్య 3,35,102 పెరిగింది. అదే విధంగా ఇప్పటి వరకు 2,61,79,085 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 17,93,645 యాక్టివ్ కేసులున్నాయి. ఇందులో కొంత మంది హోం ఐసోలేషన్‌లో ఉండి చికిత్స పొందుతుండగా మరికొందరు కొవిడ్ సెంటర్లలో చికిత్స పొందుతున్నారు.