ICC Test Rankings టాప్‌లో టీమిండియా.. టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రం..
దిశ, వెబ్‌డెస్క్ : స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టును డ్రాగా ముగించిన భారత జట్టు.. రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కోహ్లీ సేన తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు సిరీస్ దక్కించుకున్న నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది. ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. టెస్టు సిరీస్‌కు ముందు ఫస్ట్ ప్లేస్‌లో […]
దిశ, వెబ్‌డెస్క్ : స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను టీమిండియా 1-0 తేడాతో కైవసం చేసుకుంది. మొదటి టెస్టును డ్రాగా ముగించిన భారత జట్టు.. రెండో టెస్టులో 372 పరుగుల తేడాతో భారీ విజయాన్ని కోహ్లీ సేన తమ ఖాతాలో వేసుకుంది. టెస్టు సిరీస్ దక్కించుకున్న నేపథ్యంలో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియా తన స్థానాన్ని మెరుగుపరుచుకుంది.
ఐసీసీ తాజాగా విడుదల చేసిన టెస్టు ర్యాంకింగ్స్‌లో టీమిండియా అగ్రస్థానం దక్కించుకుంది. టెస్టు సిరీస్‌కు ముందు ఫస్ట్ ప్లేస్‌లో ఉన్న న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం భారత జట్టు 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా.. న్యూజిలాండ్ (121 పాయింట్లు), ఆస్ట్రేలియా (108 పాయింట్లు), ఇంగ్లాండ్ (107 పాయింట్లు), పాకిస్థాన్ (92 పాయింట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
కానీ.. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో మాత్రం టీమిండియా 42 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. మొదటి స్థానంలో శ్రీలంక, రెండో స్థానంలో పాకిస్తాన్ జట్లు కొనసాగుతున్నాయి.
https://twitter.com/ICC/status/1467742118793854978?s=20