Trade Deficit: తగ్గిన భారత వాణిజ్య లోటు

దేశం నుంచి 17.3 శాతం వృద్ధితో 39.2 బిలియన్ డాలర్ల(రూ. 3.31 లక్షల కోట్ల) విలువైన సరుకుల ఎగుమతులు పెరిగాయి.

Update: 2024-11-14 14:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుత ఏడాది అక్టోబర్‌లో భారత వాణిజ్య లోటు గణనీయంగా తగ్గింది. గురువారం ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల్లో గతనెల దేశ వాణిజ్య లోటు వార్షిక ప్రాతిపదికన 33.43 బిలియన్ డాలర్ల(రూ.2.82 లక్షల కోట్ల) నుంచి 27.14 బిలియన్ డాలర్ల(రూ.2.29 లక్షల కోట్ల) కు క్షీణించాయి. అయితే, నెలవారీగా చూసినప్పుడు సెప్టెంబర్‌లో నమోదైన 20.78 బిలియన్ డాలర్ల(రూ. 1.75 లక్షల కోట్ల)తో పోలిస్తే పెరిగాయి. ఇక, సమీక్షించిన నెలలో దేశం నుంచి 17.3 శాతం వృద్ధితో 39.2 బిలియన్ డాలర్ల(రూ. 3.31 లక్షల కోట్ల) విలువైన సరుకుల ఎగుమతులు నమోదవగా, దిగుమతుల విలువ 3.9 శాతం పెరిగి 66.34 బిలియన్ డాలర్లు(రూ. 5.60 లక్షల కోట్లు)గా ఉన్నాయి. నెలవారీగా ఎగుమతులు, దిగుమతులు రెండూ పెరిగాయి. అలాగే సేవల ఎగుమతులు 34.02 బిలియన్ డాలర్లు(రూ. 2.87 లక్షల కోట్లు)గా, దిగుమతులు 17 బిలియన్ డాలర్లు(రూ. 1.43 లక్షల కోట్లు)గా ఉన్నట్టు అంచనా. 

Tags:    

Similar News