Breaking News : భోజనంలో జెర్రీ.. కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ సీజ్
కాకినాడ సుబ్బయ్య హోటల్(Kakinada Subbaiah Hotel) ను సీజ్ చేసారు ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులు.
దిశ, వెబ్ డెస్క్ : కాకినాడ సుబ్బయ్య గారి హోటల్(Kakinada Subbaiah gari Hotel)ను సీజ్ చేసారు ఫుడ్ సేఫ్టీ(Food Safty) అధికారులు. విజయవాడలోని కాకినాడ సుబ్బయ్య గారి హోటల్ లో ఓ కస్టమర్ భోజనం చేస్తుండగా అందులో జెర్రీ వచ్చింది. అది చూసి షాక్ అయిన కస్టమర్ హోటల్ సిబ్బందిని ప్రశ్నించారు. అదే సమయంలో ఆ హోటల్ లో కేంద్ర మానవ హక్కుల కమిషన్(HRC) ఇన్చార్జి చైర్మన్ విజయభారతి సయానీ భోజనం చేస్తున్నారు. భోజనంలో జెర్రీ రావడంతో షాక్ కు గురైన కమిషన్ చైర్మన్.. హోటల్ నిర్వాహకులపై సీరియస్ అయ్యారు. ఈ విషయాన్ని ఫుడ్ సేఫ్టీ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు అందుకున్న అధికారులు పరిశీలన జరిపి, శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు పంపారు. అనంతరం హోటల్ సీజ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు.