Kaakani: బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రావాలి.. సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి కాకాణి సవాల్

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ (Super Six) పథకాలను అమలు చేసే అవకాశమే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kaakani Goverdhan Reddy) కామెంట్ చేశారు.

Update: 2024-11-14 15:46 GMT

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ (Super Six) పథకాలను అమలు చేసే అవకాశమే లేదని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Kaakani Goverdhan Reddy) కామెంట్ చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు.. ప్రవేశపెట్టిన బడ్జెట్‌కు ఏమాత్రం సంబంధం లేకుండా ఉందని ఆరోపించారు. బడ్జెట్‌పై బహిరంగ చర్చకు రావాలని సీఎం చంద్రబాబు (CM Chandrababu)కు ఆయన సవాల్ విసిరారు.

తమ ప్రభుత్వంలో రూ.10 లక్షల కోట్ల అప్పులు చేశారంటూ ప్రచారం చేశారని.. తీరా బడ్జెట్‌లో చూస్తే రూ.6.46 లక్షల కోట్లే చూపించారని ఫైర్ అయ్యారు. ఓవర్ డ్రాఫ్ట్ (Over Draft) అంటే అర్థం కూడా తెలియని వారు మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. పచ్చి అబద్ధాలు ప్రచారం చేయడం పచ్చ పార్టీకి పరిపాటిగా మారిందని ఆరోపించారు. చంద్రబాబు (Chandrababu) హయాంలో 4.47 శాతంగా ఉన్న వృద్ధి రేటు.. వైసీపీ సర్కార్ పాలనలో 4. 83 శాతానికి పెరిగిందని గుర్తు చేశారు. సూపర్ సిక్స్ (Super Six) పథకాల విషయంలో ప్రజలను మభ్య పెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని కాకాణి అన్నారు. 

Tags:    

Similar News