AP News : డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ
మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది.
దిశ, వెబ్ డెస్క్ : మహిళా సంఘాలకు ఏపీ ప్రభుత్వం(AP Govt) గుడ్ న్యూస్ తెలిపింది. డ్వాక్రా మహిళలకు ఇకపై డ్రోన్ పైలట్ శిక్షణ ఇవ్వనున్నారు. దీనిద్వారా సాగులో సాంకేతికతను వినియోగించుకోవడంతోపాటు.. మహిళా సంఘాల్లోని మహిళలకు ఆర్థిక చేయూతనివ్వడం జరుగుతుందని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(CM Chandrababu Nayudu) పేర్కొన్నారు. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్(Ratan Tata Innovation Hub) ద్వారా మహిళా పారిశ్రామిక వేత్తలను ప్రోత్సాహిస్తామని.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందిస్తామని ప్రకటించారు. ఓర్వకల్లులో ఏర్పాటు చేయబోయే డ్రోన్ సిటీలో 10 వేల మంది డ్వాక్రా మహిళలకు డ్రోన్ పైలట్ శిక్షణ ఇస్తామన్నారు.