తొలిసారి టాస్ గెలిచిన టీమిండియా.. విరాట్ కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది క్షణాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా జట్టు స్కాట్‌లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన టీమిండియా రెండు మ్యాచుల్లో పరాజయం పొంది, గత అఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక స్కాట్‌లాండ్ ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టేందుకు స్కాట్‌లాండ్ సన్నద్ధం కాగా, అద్భుతాలు సృష్టించి సెమీస్‌కు వెళ్లేందుకు టీమిండియా […]

Update: 2021-11-05 08:08 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా మరికొద్ది క్షణాల్లో దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా టీమిండియా జట్టు స్కాట్‌లాండ్‌తో తలపడనుంది. ఈ సిరీస్‌లో ఇప్పటికే మూడు మ్యాచులు ఆడిన టీమిండియా రెండు మ్యాచుల్లో పరాజయం పొంది, గత అఫ్ఘనిస్తాన్ మ్యాచ్‌లో 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక స్కాట్‌లాండ్ ఆడిన 3 మ్యాచుల్లోనూ ఓడిపోయింది. దీంతో టీ20 వరల్డ్ కప్‌లో బోణీ కొట్టేందుకు స్కాట్‌లాండ్ సన్నద్ధం కాగా, అద్భుతాలు సృష్టించి సెమీస్‌కు వెళ్లేందుకు టీమిండియా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇక ఈ మ్యాచ్‌లో భాగంగా టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకుంది. వరుసగా మూడు మ్యాచుల్లో టాస్ ఓడిన ఇండియా.. నాలుగో మ్యాచ్‌లో స్కాట్‌లాండ్‌పై టాస్ గెలిచింది. ఇక ఈ మ్యాచ్‌లో టీమిండియా ప్రదర్శన ఎలా ఉంటుందో అనేది అభిమానుల్లో ఆసక్తిని రేపుతోంది.

Tags:    

Similar News