30/4.. షాక్‌లో భారత్ !
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. టోర్నీ మొత్తం ఫుల్ ఫామ్‌లో ఉన్న షఫాలి వర్మ 2 (3 బంతుల్లో) స్కట్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే హీలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రోడ్రిగ్స్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. రెండు ఫోర్లతో అలరించిన స్మృతి మంధాన (11) మొలినెక్స్ బౌలింగ్‌లో, కెప్టెన్ హర్మన్ ప్రీత్ […]
185 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టుకు తొలి ఓవర్లోనే షాక్ తగిలింది. టోర్నీ మొత్తం ఫుల్ ఫామ్‌లో ఉన్న షఫాలి వర్మ 2 (3 బంతుల్లో) స్కట్ వేసిన మొదటి ఓవర్ మూడో బంతికే హీలీకి క్యాచ్ ఇచ్చి వెనుదిరగడం ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన రోడ్రిగ్స్ (0) ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరింది. రెండు ఫోర్లతో అలరించిన స్మృతి మంధాన (11) మొలినెక్స్ బౌలింగ్‌లో, కెప్టెన్ హర్మన్ ప్రీత్ 4 (1 ఫోర్) జొనాసెన్ బౌలింగ్‌లో వెంవెంటనే అవుట్ కావడంతో భారత్ 5.4 ఓవర్లలో 30/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఇప్పటికే ప్రధాన బ్యాట్స్‌ఉమెన్ పెవిలియన్ చేరడంతో భారత్ వరల్డ్ కప్ ఆశలు చేజారినట్టే కనిపిస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప విజయం దక్కేలా లేదు.
tags: ICC, women T20, shafali, mandhana, harmanpreet