టెస్టుల్లో టాప్ ర్యాంక్ కోల్పోయిన భారత్
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో తమ టాప్ ర్యాంకును ఆస్ట్రేలియాకు కోల్పోయింది. కాగా, 2016 అక్టోబర్ నుంచి భారత్ టాప్ ర్యాంకులో కొనసాగింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ పూర్తిగా స్తంభించినా.. ఐసీసీ నిబంధనల మేరకు కొత్త ర్యాంకులు ప్రకటించడం విశేషం. ఈ మేరకు 116 రేటింగ్ పాయింట్లతో తాజాగా ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (115), భారత్ (114) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నిబంధనల మేరకు 2019-20 సీజన్‌లో సాధించిన విజయాల నుంచి […]
దిశ, స్పోర్ట్స్: భారత క్రికెట్ జట్టు టెస్టుల్లో తమ టాప్ ర్యాంకును ఆస్ట్రేలియాకు కోల్పోయింది. కాగా, 2016 అక్టోబర్ నుంచి భారత్ టాప్ ర్యాంకులో కొనసాగింది. కరోనా నేపథ్యంలో క్రికెట్ పూర్తిగా స్తంభించినా.. ఐసీసీ నిబంధనల మేరకు కొత్త ర్యాంకులు ప్రకటించడం విశేషం. ఈ మేరకు 116 రేటింగ్ పాయింట్లతో తాజాగా ఆస్ట్రేలియా జట్టు అగ్రస్థానంలో నిలిచింది. న్యూజిలాండ్ (115), భారత్ (114) తర్వాతి స్థానాల్లో నిలిచాయి. నిబంధనల మేరకు 2019-20 సీజన్‌లో సాధించిన విజయాల నుంచి 100 శాతం రేటింగ్ పాయింట్లు, అంతకు మునుపు సీజన్ నుంచి 50 శాతం రేటింగ్ పాయింట్లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటారు. అయితే, భారత జట్టు 2016 నుంచి 12 విజయాలతో పాటు ఒక ఓటమిని మాత్రమే నమోదు చేయడంతో అగ్రస్థానంలో నిలిచింది. కానీ ఇప్పుడు ఆ విజయాలపై 50 శాతం రేటింగ్ పాయింట్లు మాత్రమే భారత జట్టుకు లభించాయి.
ఇక, గత సీజన్ ఆఖర్లో న్యూజిలాండ్‌పై రెండు టెస్టు మ్యాచ్‌లను కోల్పోయింది. దీంతో భారత జట్టు రేటింగ్ పాయింట్లను కోల్పోవలసి వచ్చింది. కాగా, ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానంలోని మూడు జట్ల మధ్య ఒక్కో పాయింట్ మాత్రమే తేడా ఉండటం గమనార్హం. మరోవైపు ఆస్ట్రేలియా జట్టు టెస్టుల్లోనే కాకుండా టీ20ల్లో కూడా టాప్ ర్యాంకు కైవసం చేసుకోగా.. భారత జట్టు టీ20లో మూడో స్థానం, వన్డేల్లో రెండో స్థానంలో నిలిచింది.
Tags: ICC Rankings, Test Rank, India, Australia, New Zealand, Cricket