డ్రాగా ముగిసిన ప్రాక్టీస్ మ్యాచ్
న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడురోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ శుభారంభం చేశారు. పృథ్వీషా 39, అగర్వాల్ 81 పరుగులతో ఆకట్టుకున్నారు. షా అవుట్ అయిన అనంతరం వచ్చిన శుభ్‌మన్ గిల్ మరోసారి […]
న్యూజిలాండ్ ఎలెవన్‌తో జరుగుతున్న మూడురోజుల సన్నాహక మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్‌తో భారత ఆటగాళ్లకు మంచి ప్రాక్టీస్ లభించింది. 59 పరుగుల ఓవర్ నైట్ స్కోర్ తో ఆదివారం బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 252 పరుగులు చేసింది. ఓపెనర్లు పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ శుభారంభం చేశారు. పృథ్వీషా 39, అగర్వాల్ 81 పరుగులతో ఆకట్టుకున్నారు. షా అవుట్ అయిన అనంతరం వచ్చిన శుభ్‌మన్ గిల్ మరోసారి నిరాశపర్చాడు. 8 పరుగులకే పెవిలియన్ బాట పట్టాడు. అనంతరం వచ్చిన రిషబ్ పంత్ ధాటిగా ఆడి, 65 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 70 పరుగులు చేశాడు. మూడో వికెట్‌కు మయాంక్ , రిషబ్ పంత్ జోడి 134 పరుగులు జోడించారు. అనంతరం వృద్ధిమాన్ సాహా, అశ్విన్ మ్యాచ్ ముగిసే వరకు బ్యాటింగ్ చేశారు. కాగా, ఈ నెల 21 నుంచి భారత్, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ ప్రారంభం కానుంది.