వంద దాటిన పెట్రోల్

దిశ, ముధోల్: పెట్రోల్, డీజిల్ ధర రోజు రోజుకు పెరుగుతూనే వుంది. గత కొన్ని రోజులుగా వంద రూపాలకు దగ్గర వున్నా పెట్రోల్ ధర సోమవారం ఉదయం గరిష్టంగా 100.11 రూపాలు చేరి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది.  ఒక వైపు లాక్ డౌన్, మరో వైపు పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లాక్ డౌన్ ప్రభావం తో సామాన్య ప్రజలు ఆర్థకపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు రేట్లు […]

Update: 2021-05-30 21:29 GMT

దిశ, ముధోల్: పెట్రోల్, డీజిల్ ధర రోజు రోజుకు పెరుగుతూనే వుంది. గత కొన్ని రోజులుగా వంద రూపాలకు దగ్గర వున్నా పెట్రోల్ ధర సోమవారం ఉదయం గరిష్టంగా 100.11 రూపాలు చేరి వాహనదారులకు చుక్కలు చూపిస్తుంది. ఒక వైపు లాక్ డౌన్, మరో వైపు పెరిగిన పెట్రోల్, నిత్యావసర సరకుల ధరలు సామాన్య ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. లాక్ డౌన్ ప్రభావం తో సామాన్య ప్రజలు ఆర్థకపరమైన సమస్యలతో సతమతమవుతున్నారు. దీనికి తోడు రేట్లు పెరగడంతో వారి బ్రతుకు చిన్న భిన్నం అవుతుంది. ఇలా రోజు రోజు కి పెట్రోల్, డీజిల్ ధరలు,నిత్యావసరసరకుల రేట్లు పెరగడంతో ప్రజలు ప్రభుత్వాల పై తీవ్ర అసంతృప్తి చూపిస్తున్నారు.

Tags:    

Similar News