హైదరాబాద్‌లో బిగ్ మిస్టరీ.. ఆలయం కింద అస్థిపంజరం

దిశ, వెబ్‌డెస్క్ : ఆలయ సెల్లార్‌లో అస్థిపంజరం కలకలం సృష్టించింది. సుమారు ఏడాది క్రితం హత్య చేసినట్లు తెలుస్తోంది. నిత్యం వందల మంది ఆలయానికి పూజ కోసం వస్తున్నా ఏ ఒక్కరూ దీనిని గుర్తించకపోవడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిబాబా గుడి కింద ఉన్న సెల్లార్‌ను పాల్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అతడు గత ఏడాదిగా అద్దె చెల్లించకుండా తిరుగుతున్నాడు. ఇదే క్రమంలో గత కొన్ని […]

Update: 2021-02-10 05:31 GMT

దిశ, వెబ్‌డెస్క్ : ఆలయ సెల్లార్‌లో అస్థిపంజరం కలకలం సృష్టించింది. సుమారు ఏడాది క్రితం హత్య చేసినట్లు తెలుస్తోంది. నిత్యం వందల మంది ఆలయానికి పూజ కోసం వస్తున్నా ఏ ఒక్కరూ దీనిని గుర్తించకపోవడం గమనార్హం. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో సాయిబాబా గుడి కింద ఉన్న సెల్లార్‌ను పాల్ అనే వ్యక్తి అద్దెకు తీసుకున్నాడు. అతడు గత ఏడాదిగా అద్దె చెల్లించకుండా తిరుగుతున్నాడు.

ఇదే క్రమంలో గత కొన్ని రోజుల నుంచి ఆలయ పరిసరాల్లో దుర్వాసన రావడం మొదలైంది. ఎక్కడ వెదికినా దుర్వాసన రావడం ఆగలేదు. సెల్లార్‌లో ఉంటున్న పాల్ కనిపించకపోవడం.. దుర్వాసన సైతం సెల్లార్ నుంచే వస్తుండడంతో ఆలయ పూజారి బుధవారం పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

ఎస్ఆర్ నగర్ పోలీసులు ఆలయాన్ని పరిశీలించి, సెల్లార్ షెటర్‌ను తొలగించారు. ఆ రూం నుంచి దుర్వాసన అధికంగా రావడంతోపాటు అంతా వెతికారు. అయినా ఎక్కడా ఏం కనిపించలేదు. చివరకు మూలకు పడి ఉన్న ఇనుప పెట్టెను తెరిచి చూడగా పూర్తిగా కుళ్లిపోయిన అస్థిపంజరం కనిపించింది.

పోలీసులు అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకోని ఫొరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. 30 ఏళ్లు పైబడిన వ్యక్తి అస్థిపంజరంగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే 2017 నుంచి అద్దెకు ఉంటున్న పాల్ కనిపించకపోవడంతో ఈ హత్య మిస్టరీగా మారింది. అయితే చనిపోయిన వ్యక్తి ఎవరు ? ఎందుకు హత్య చేశారు? అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. పాల్ అచ్చే అద్దెతోనే పూజారికి నెలవారి వేతనం ఇస్తున్నారు. అద్దె ఆగిపోవడంతో ఆలయ పూజారి సెల్లార్‌పై దృష్టి పెట్టారు. ఆయనకే అనుమానం రాకపోతే ఇంకెన్ని రోజులకు ఈ హత్య ఘటన బయటపడెదో అని స్థానికులు అంటున్నారు.

మంచంపై కుళ్లిన శవం.. ఇంట్లోనే కుటుంబీకులు!

Tags:    

Similar News