అసోంలో అధికారపక్షానికే ఆధిక్యం

గువహతి: అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారపక్ష కూటమే ఆధిక్యంలో కొనసాగుతున్నది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు కమలనాథుల విజయానికి గండికొట్టవచ్చని అంచనాలు తారుమారయ్యాయి. అసోంలో మూడు విడతల్లో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి 78 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 86 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయాన్ని సాధించింది. కాగా, కాంగ్రెస్ కూడా మెరుగైన ఫలితాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నది. గతేడాది 26 స్థానాలకే పరిమితమైన యూపీఏ […]

Update: 2021-05-02 03:41 GMT

గువహతి: అసోంలో బీజేపీ సారథ్యంలోని ఎన్‌డీఏ అధికారపక్ష కూటమే ఆధిక్యంలో కొనసాగుతున్నది. సీఏఏ, ఎన్‌ఆర్‌సీలు కమలనాథుల విజయానికి గండికొట్టవచ్చని అంచనాలు తారుమారయ్యాయి. అసోంలో మూడు విడతల్లో మొత్తం 126 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఇందులో ప్రస్తుతం ఎన్‌డీఏ కూటమి 78 స్థానాల్లో ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 86 స్థానాల్లో ఎన్‌డీఏ కూటమి విజయాన్ని సాధించింది. కాగా, కాంగ్రెస్ కూడా మెరుగైన ఫలితాలను కైవసం చేసుకునే దిశగా వెళ్తున్నది. గతేడాది 26 స్థానాలకే పరిమితమైన యూపీఏ కూటమి తాజాగా, 46 స్థానాల్లో లీడింగ్‌లో ఉన్నది. ఆధిక్యం ఇలాగే కొనసాగితే మళ్లీ అధికారపక్ష ఎన్‌డీఏనే రాష్ట్రంలో వరుసగా రెండోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసే అవకాశముంది. అధికారం కోసం గెలుచుకోవాల్సిన సీట్లు 64.

 

 

Tags:    

Similar News