ఐసీసీ తాత్కాలిక చైర్మన్‌గా ఇమ్రాన్ ఖ్వాజా

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. నాలుగేళ్లుగా ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక జరిగే వరకు ప్రస్తుత డిప్యుటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా తాత్కలిక చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. వచ్చే వారంలో ఐసీసీ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని బోర్డు స్పష్టం చేసింది. ‘ఐసీసీ బోర్డు, సిబ్బంది, క్రికెట్ కుటుంబం మొత్తం శశాంక్‌కు […]

Update: 2020-07-01 12:10 GMT

దిశ, స్పోర్ట్స్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) చైర్మన్ పదవి నుంచి శశాంక్ మనోహర్ తప్పుకున్నారు. నాలుగేళ్లుగా ఐసీసీ తొలి స్వతంత్ర చైర్మన్‌గా ఆయన పదవీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ తర్వాత చైర్మన్ ఎన్నిక జరిగే వరకు ప్రస్తుత డిప్యుటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా తాత్కలిక చైర్మన్‌గా వ్యవహరిస్తారని ఐసీసీ తెలిపింది. వచ్చే వారంలో ఐసీసీ చైర్మన్ ఎన్నికకు సంబంధించిన ప్రక్రియ మొదలవుతుందని బోర్డు స్పష్టం చేసింది. ‘ఐసీసీ బోర్డు, సిబ్బంది, క్రికెట్ కుటుంబం మొత్తం శశాంక్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నది. ఆయన నాయకత్వానికి, క్రికెట్‌కు ఆయన చైర్మన్‌గా చేసిన సేవకు రుణపడి ఉంటాం. ఆయన తన కుటుంబంతో సంతోషంగా మిగిలిన సమయం గడపాలని కోరుకుంటున్నా’ అని ఐసీసీ సీఈవో మనూ సాహ్ని ఒక ప్రకటనలో తెలిపారు. ఇక మధ్యంతర చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన ఇమ్రాన్ మాట్లాడుతూ ‘ఐసీసీ బోర్డులో ఉన్న ప్రతీ ఒక్కరి తరఫున నా ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఐసీసీని ఒక మంచి క్రీడా సంస్థగా మార్చడంలో శశాంక్‌ది కీలక పాత్ర’ అని అన్నారు.

Tags:    

Similar News