ఊటీ వెళ్తే ఆ జాగ్రత్త పాటించండి… లేకుంటే 6 నెలలు జైలుకే…

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ ఊటీలో ఓ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య. కరోనా కేసులు మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాస్క్ ధరించకుంటే 6 నెలలు జైలు శిక్ష విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించడానికి 20 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకూ మాస్క్ ధరించకుండా బహిరంగంగా తిరిగేవారి […]

Update: 2021-03-12 05:47 GMT

దిశ, వెబ్ డెస్క్: ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ ఊటీలో ఓ స్ట్రిక్ట్ రూల్ పాస్ చేశారు నీలగిరి జిల్లా కలెక్టర్ ఇన్సెంట్ దివ్య. కరోనా కేసులు మళ్ళీ పుంజుకుంటున్న నేపథ్యంలో అరికట్టే చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మాస్క్ ధరించకుంటే 6 నెలలు జైలు శిక్ష విధిస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు. మాస్కులు లేకుండా తిరిగేవారిని గుర్తించడానికి 20 స్పెషల్ టీమ్స్ ను ఏర్పాటు చేసినట్టు కలెక్టర్ తెలిపారు. ఇప్పటి వరకూ మాస్క్ ధరించకుండా బహిరంగంగా తిరిగేవారి నుండి రూ.30.68 లక్షలు ఫైన్ రూపంలో వసూలు చేసినట్టు ఆమె వెల్లడించారు. కాగా ఇకపై మాస్క్ లేకుండా బయట తిరిగితే 6 నెలల జైలు శిక్షతోపాటు, రూ.200 జరిమానా కూడా విధిస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News